Site icon HashtagU Telugu

Weak Up Early: వామ్మో.. ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల అన్ని రకాల ప్రయోజనాల?

Weak Up Early

Weak Up Early

మన ఇంట్లోని పెద్దలు ఉదయాన్నే సూర్యోదయం కాకముందే లేవమని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది అవేమీ పట్టించుకోకుండా బారెడు పొద్దెక్కిన కూడా అలాగే నిద్రపోతూ ఉంటారు. ముఖ్యంగా సిటీలలో ఉండే వాళ్ళు ఉదయం 10 గంటలకు నిద్ర లేచి ఆ సమయంలో బ్రష్ చేసి టిఫిన్ తింటూ ఉంటారు. కానీ వైద్యులు కూడా అలా అంతసేపటి వరకు పడుకోవడం మంచిది కాదు అంటున్నారు. టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో అందరూ స్మార్ట్ ఫోన్ లు, మొబైల్ ఫోన్ లు వినియోగించడం వల్ల ఆలస్యంగా నిద్రపోతూ ఉంటారు. ఆలస్యంగా నిద్రపోయే అలవాటు అలాగే నిద్రలేచే అలవాటు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే? ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

మరి ఉదయాన్నే లేవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఆ రోజంతా కూడా ఎనర్జీగా ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. కాబట్టి రాత్రి త్వరగా నిద్రపోవడం మంచిది. తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఆ రోజు మిమ్మల్ని పూర్తిగా యాక్టివ్‌గా ఉంచుతుంది. మీరు ఏ పని చేసినా చురుగ్గా చేస్తారు. అలాగే తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల సూర్యుని అనుగ్రహం లభిస్తుంది. ఉదయం సూర్యకిరణాలు చర్మంలోకి చొచ్చుకుపోయినప్పుడు దాని ఆరోగ్యకరమైన లక్షణాలలో ఒకటి.

అలాగే, ఈ సూర్యకిరణాల నుండి మీ శరీరం కొత్త శక్తిని పొందుతుంది. అలాగే మార్నింగ్ వైబ్ లేదా మార్నింగ్ వాతావరణం నిజంగా ఆనందదాయకంగా ఉంటుంది. ఆనందాన్ని ఇస్తుంది. తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల మనిషి ఉత్పాదకత పెరుగుతుంది. ఇది మనిషిని ఉత్తమంగా పని చేయడానికి వీలు కల్పిస్తుంది. ఉదయాన్నే వచ్చే చల్లని జాత గాలి మీ జీవితంలో అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఈ గాలి మీ ఏకాగ్రతను పెంచేంత శక్తివంతమైనది. కాబట్టి ప్రజలు ఉదయం ఉత్తమ గాలి కోసం ఉదయం యోగా వ్యాయామం చేస్తారు. ఇప్పుడు ఉదయం గాలి, వాతావరణం అస్తవ్యస్తమైన మనస్సును మారుస్తుంది. మెరుగైన మరింత విజయవంతమైన మానసిక స్థితిని సృష్టిస్తుంది.

వాతావరణం తాజాగా ఉండటమే కాకుండా మనసును తాజాగా ఉంచుతుంది. కాబట్టి మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టవచ్చు. అలాగే, ఉదయాన్నే తాజా గాలి, కొత్త సూర్యకాంతి మీ నొప్పి ఒత్తిడిని తగ్గిస్తుంది. అదేవిధంగా మీరు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచినట్లయితే, మీరు ప్రతిరోజూ ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు. ఇది తరువాత మీ అభిరుచిగా మారుతుంది. తరువాత ఇది ఒక నమూనాగా మారుతుంది.