Site icon HashtagU Telugu

Mango: ఆ వ్యాధులకు చెక్ పెట్టాలి అంటే మామిడికాయ తినాల్సిందే?

Mixcollage 15 Jun 2024 05 42 Pm 1875

Mixcollage 15 Jun 2024 05 42 Pm 1875

మామిడి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మామిడిపండ్ల సీజన్ కావడంతో మార్కెట్లో మనకు ఎక్కడ చూసినా కూడా పెద్ద మొత్తంలో మామిడికాయలు లభిస్తూ ఉంటాయి. మామిడి పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. కొందరు జ్యూస్ రూపంలో తీసుకుంటే మరికొందరు డైరెక్ట్ గా తినేస్తూ ఉంటారు. ఇక మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తూ ఉంటారు. ఈ పండ్లు కేవలం వేసవికాలంలో మాత్రమే లభిస్తూ ఉంటాయి.

కేవలం మామిడి పండ్లు మాత్రమే కాకుండా మామిడికాయ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, ఫైబర్, పొటాషియం, కాపర్, సోడియం వంటి పోషకాలు ఉంటాయి. అనేకరకాల వ్యాధులను ఇది దూరం చేస్తుంది. కాగా పచ్చి మామిడిలో ఉండే విటమిన్ సి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కడుపుకు కూడా చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.

కడుపులో ఎసిడిటీ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అదేవిదంగా కంటికి ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు దృఢంగా అవుతాయి. కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పచ్చిమామిడిని ప్రతిరోజు తీసుకుంటుంటే ఎముకలకు సంబంధించిన సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. పచ్చి మామిడి పన్నాను వినియోగిస్తే వడదెబ్బ తగలదు.