Weight Loss: బరువు తగ్గుతున్నామని సంబర పడకండి…ఓ సారి మీ కిడ్నీల పనితీరు చెక్ చేసుకోండి..!!

శరీరంలో భాగాలలో అన్నింటికంటే మూత్రపిండాల పాత్ర చాలా ముఖ్యమైంది.

  • Written By:
  • Publish Date - May 29, 2022 / 08:31 AM IST

శరీరంలో భాగాలలో అన్నింటికంటే మూత్రపిండాల పాత్ర చాలా ముఖ్యమైంది. డయాబెటిస్, హైబీపీ లాంటి వ్యాధుల కారణంగా మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. కిడ్నీల పనితీరు మందగించినట్లయితే…శరీరం మొత్తానికే ప్రమాదం. అంతే రెండు కిడ్నీలు పాడైతే…బతకడం కష్టం. కాబట్టి ప్రాథమిక దశలో కిడ్నీల సమస్యను గుర్తించాలి. సరైన చికిత్స తీసుకోవడం మంచిది. మరి కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా ఇలా తెలుసుకోవచ్చు.

*మూత్రరంగులో మార్పులు, మూత్రంలో అసాధారణ మార్పలు కనిపించిన మూత్రపిండాల సమస్య ఉందని భావించాలి.
* కిడ్నీలు పాడైనప్పుడు అవి ఉండే భాగంలో నొప్పిగా ఉంటుంది.
*ఆకలి ఉండదు. బరువు తగ్గుతారు.
* కిడ్నీలు పూర్తిగా చెడిపోతే..రుచి సామర్ధ్యంతోపాటు ఆకలి కూడా తగ్గుతుంది.
* రక్తంలోని వ్యర్థాల కారణంగా వికారం, వాంతులు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
*కిడ్నీలు సరిగ్గా పనిచేయనట్లయితే…శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఫలితంగా ముఖం, కాళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి.
*ఎర్రరక్త కణాలు సంఖ్య తగ్గుతుంది.
*ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో శ్వాస సమస్యలు వస్తాయి.
* ఏ విషయంపైనా ఏకాగ్రత ఉంచలేకపోవడం, తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి సమస్యలు చుట్టుముట్టుతాయి.

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే…ఈ ఆహారపదార్థాలు తీసుకోవాలి…

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలి. ప్రతిరోజు 7 నుంచి 8 గ్లాసుల నీరు త్రాగాలి. ఎక్కువగా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ కూడా తేలిగ్గా బయటకు వెళ్లిపోతాయి. అంతేకాదు వెల్లుల్లితో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు వెళ్లేలా చేస్తాయి. వీటిని పచ్చిగా లేదా వంటల్లో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఆపిల్ తిన్నట్లయితే కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే వీటిలోఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులు కూడా కిడ్నీలకు మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ బి, విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. కాలిఫ్లవర్ లో ఉండే సల్ఫర్ పొటాషియం, శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతాయి. ఫలితంగా కిడ్నీల పనితీరు మెరుగవడంతోపాటు ఆరోగ్యంగా ఉంటాయి.