Site icon HashtagU Telugu

Ranapala: ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటే చాలు.. రోగాలు నయం అవ్వాల్సిందే?

Ranapala

Ranapala

ప్రకృతి మనకు ఎన్నో రకాల ఔషధ మొక్కలను అందించింది. ప్రకృతిలో ఉన్న మొక్కలు చాలా వరకు మనకు ఉపయోగపడేవి. కానీ చాలామందికి వాటి ఉపయోగం తెలియక వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తూ వాటిని పీకు భావిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొక్క కూడా ఒకటి. ఈ మొక్కను చాలామంది ఇంటి దగ్గర కూడా పెంచుకుంటూ ఉంటారు. ఆ మొక్క మరేదో కాదు రణపాల. ఈ మొక్క ఆకులు కాస్త మందంగా ఉండి తుంచినప్పుడు పాలు వంటి పదార్థం కారుతూ ఉంటుంది. ఈ ఆకు తింటే కాస్త పులుపుగా వగరుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్క ఆకు ద్వారానే ప్ర‌త్యుత్ప‌త్తిని కొన‌సాగిస్తుంది.

ఈ మొక్క ఆకుల‌ను నాటితే చాలు మళ్ళీ ఇంకో మొక్క మొలుస్తుంది. ఈ మొక్కను ఇంటి ఆవ‌ర‌ణ‌లో సుల‌భంగా పెంచుకోవ‌చ్చు. 150 రోగాలకు రణపాల దివ్యౌషధం. ర‌ణ‌పాల ఆకులు మూత్ర పిండాల స‌మ‌స్య‌లు, మూత్ర పిండాల రాళ్ళు ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. కానీ చాలామంది ఈ మొక్కను పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు. మరి ఈ రణపాల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మూత్రపిండాల సమస్యలకు రణపాల మొక్క ఎంతో బాగా పనిచేస్తుంది. ఉద‌యం ఆకుల క‌షాయాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగ‌వడం వల్ల మూత్రపిండాల సమస్యల నుంచి బయటపడవచ్చు. మూత్రపిండాలు, బ్లాడ‌ర్‌లో ఉండే రాళ్ళు క‌రిగిపోతాయి.

ర‌ణ‌పాల ఆకుల‌ను తింటే ర‌క్తంలోని క్రియాటిన్ లెవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి. ఇది డ‌యాబెటిస్ రోగుల‌కు ఎంతో మేలు చేస్తుంది. మూత్ర‌పిండాల ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ చెట్టు ఆకులను రెండు చొప్పున తీసుకోవడం వల్ల డయాబెటిస్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు కూడా ఈ రణపాల మొక్క ఎంతో మేలు చేస్తుంది. జీర్ణాశ‌యంలోని అల్స‌ర్లు త‌గ్గుతాయి. అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చుజ‌లుబు, ద‌గ్గు, విరేచ‌నాల‌ను న‌యం చేసే గుణాలు ఈ ఆకుల్లో ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఆకుల రసంను ఒక్క చుక్క చెవిలో వేస్తే చెవిపోటు సమస్య తగ్గుతుంది. అలాగే ర‌ణ‌పాల ఆకుల‌ను పేస్ట్‌లా చేసి నుదుటిపై ప‌ట్టీలా వేసుకుంటే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.

మ‌లేరియా టైఫాయిడ్ జ్వ‌రాలు వ‌చ్చిన వారు రణపాల ఆకులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ర‌ణ‌పాల ఆకుల‌ను తిన‌డం వల్ల హైబీపీ కూడా కంట్రోల్ అవుతుందట. అలాగే రణపాలతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకును తరుచుగా తీసుకోవడం వల్ల మూత్రంలో ర‌క్తం, చీము వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. రణపాల ఆకుల‌ను తింటే జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. తెల్ల వెంట్రుక‌లు రావ‌డం ఆగుతుంది. కామెర్లతో బాదపడే వారు రోజూ ఉద‌యం, సాయంత్రం ఈ ఆకుల ర‌సాన్ని 30 ఎంఎల్ మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ర‌ణ‌పాల ఆకుల‌ను పేస్ట్‌లా చేసి క‌ట్టు క‌డుతుంటే కొవ్వు గ‌డ్డ‌లు, వేడి కురుపులు పోతాయి. కాబట్టి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న ఈ రణపాల మొక్కను ఇంటి ఆవరణలో ఉంచుకోవడంతో పాటు తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

note: పైన ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వాటిని ఫాలో అవ్వాలా లేదా అన్నది మీ వ్యక్తిగతం.