Ragi Malt: రాగి జావ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

ప్రస్తుత రోజుల్లో రాగి జావ తాగే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇదివరకటి రోజుల్లో రాగి జావ అంటే ఇష్టపడిన వారు కూడా ప్రస్తుత రోజుల్లో

Published By: HashtagU Telugu Desk
Mixcollage 17 Jan 2024 03 29 Pm 3936

Mixcollage 17 Jan 2024 03 29 Pm 3936

ప్రస్తుత రోజుల్లో రాగి జావ తాగే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇదివరకటి రోజుల్లో రాగి జావ అంటే ఇష్టపడిన వారు కూడా ప్రస్తుత రోజుల్లో రాగిజావను తెగ తాగేస్తున్నారు. ప్రస్తుతం బయట చిన్నచిన్న టీ షాప్ లలో కూడా ఈ రాగిజావని తప్పకుండా తయారు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఎక్కువ శాతం షుగర్ వ్యాధి గ్రస్తులు ఉండడంతో ఈ రాగి జావను కూడా ఎక్కువగానే తయారు చేస్తున్నారు. మీకు తెలుసా ఈ రాగి జావ వల్ల ఒక్క షుగర్ వ్యాధిగ్రస్తులకు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. మరి రాగి జావ వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాగులలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి.

దీంతో పాటు బి విటమిన్లు, ఐరన్ లాంటివి సమృద్ధిగా ఉంటాయి. రాగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఉదయాన్ని రాగి జావ తాగితే చాలా మంచిది. రోగాలకు చెక్ పెట్టవచ్చు. రాగులను ఉప్మా లాగా చేసుకొని తింటే శరీరానికి అధిక బలం వస్తుంది. మొలకెత్తిన రాగులు తిన్నా చాలా బెటర్. ఇందులో అనేక పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి చేకూర్చే బలమైన పోషకాలన్నీ రాగులల్లో లభిస్తాయి. రాగుల్లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్నాయి. కావున రాగులు మధుమేహ రోగులకు మంచి ఆహారం. రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షిస్తాయని పేర్కొంటున్నారు. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రాగుల్లో ఎక్కువగా పీచు పదార్ధాలు ఉన్నాయి.

కావున వీటివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్ద పేగు కాన్సర్‌ నుంచి రక్షణ లభిస్తుంది. బరువును కూడా తగ్గిస్తాయి. రాగులు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి అంటు వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతాయి. ఎముకలు ధృఢంగా ఉంచడమే కాకుండా కండరాలకు బలం చేకూరుతుంది. కావున ఉదయాన్నే రాగి జావ తాగితే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. ఈ రాగి జావ ని కూడా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు.. వేడి నీటిలో తగినంత రాగి పిండి కలిపాలి. ఆ తర్వాత జావలా చేసుకోవాలి. దీని రుచి కోసం కొంచెం మజ్జిగ, బెల్లం లాంటివి కలుపుకోని తాగవచ్చు. అయితే ఉదయాన్నే తాగితే చాలా మంచిది.

  Last Updated: 17 Jan 2024, 03:30 PM IST