Radish Side Effects: శీతాకాలం దొరికే వాటిలో ముల్లంగి కూడా ఒకటి. ఈముల్లంగి వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ ముల్లంగిని ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. కాగా ముల్లంగిని తరచుగా తినడం వల్ల అనేక రకాల లాభాలు కూడా కలుగుతాయి. ముల్లంగి ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు ముల్లంగిని అసలు తినకూడదని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు ముల్లంగిని తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముల్లంగిలో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సెలీనియం, విటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే వాటిలో తక్కువ మొత్తంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఇనుము, జింక్, రాగి కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరాన్ని నిర్విషీకరణ చేయడం, బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన చర్మం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ప్రయోజనాలను అందిస్తాయట. కాగా ముల్లంగిని తినకూడని వారిలో థైరాయిడ్ రోగులు కూడా ఒకరు. ముల్లంగిలో గాయిట్రోజెన్ లు ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి.
ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారు పచ్చి ముల్లంగిని తినకుండా ఉండాలట. శీతాకాలంలో చల్లని ఆహారాలు ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి, ఆస్తమా రోగులు ముల్లంగి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలట. వీరు ముల్లంగికీ దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు. అదేవిధంగా దగ్గు, జలుబు లేదా తలనొప్పి సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పచ్చి ముల్లంగి తినకూడదట. ఎందుకంటే ఇది ఆరోగ్య సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని, మైగ్రేన్లు ఉన్నవారికి కూడా ఇది సరైనది కాదని చెబుతున్నారు. గర్భధారణ సమయంలో ముల్లంగి పరిమిత పరిమాణంలో తీసుకోవాలట. ముల్లంగిలో సోడియం అధికంగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలట. పరాఠాల తయారీలో ఉప్పు వాడటం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని చెబుతున్నారు. జీర్ణ సమస్యలు ఉన్నవారు ముల్లంగి తినకుండా ఉండాలట. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుందట.
Radish Side Effects: ముల్లంగి ఆరోగ్యానికి మంచిదే కానీ.. వీరు తింటే మాత్రం అదే ఆఖరి రోజు!

Radish Side Effects