మన వంటింట్లో ఉండే కూరగాయలలో ముల్లంగి కూడా ఒకటి. ముల్లంగి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముల్లంగితో ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. రుచి కాస్త ఘాటుగా ఉంటుంది. దీనివల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ముల్లంగి రసం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. మరి ముల్లంగి రసం తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముల్లంగి రసం తాగడం వల్ల కడుపు శుభ్రం అవుతుందట. రక్తంలోని వ్యర్థాలు తొలగిపోతాయట. ఎముకలు దృఢంగా ఉంటాయట. రాత్రి భోజనంలో తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుందట. ముల్లంగిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుందట. అదేవిధంగా మలబద్ధకాన్ని నివారిస్తుందని, పేగు కదలికలను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ముల్లంగిలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు జ్యూస్ లాగా తీసుకోవచ్చు. ముల్లంగిలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలను అందిస్తాయట. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందట.
పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందట. ఫోలేట్ కణాల అభివృద్ధికి ముఖ్యమైనదని చెబుతున్నారు. ముల్లంగి జ్యూస్ తాగిన తర్వాత శరీరం కాస్త అలసటగా అనిపిస్తుందట. ఎందుకంటే పొట్ట ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుందట. వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరాన్ని బలోపేతం చేసుకోవచ్చట. ముల్లంగి రసం కొవ్వును కరిగించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. దాంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ముల్లంగి రసం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్య సలహా తీసుకోవడం మంచిది. ప్రతి రోజు కాకుండా వారానికి ఒకటి రెండు సార్లు తీసుకోవడం మంచిది. అలాగే మోతాదు మించకుండా తీసుకోవాలి. కొంతమందికి ముల్లంగి రసం పడకపోవచ్చు. అలాంటివారు వైద్యుని సంప్రదించి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.