Site icon HashtagU Telugu

Quitting Coffee: నెల రోజుల పాటు కాఫీ తాగడం మానేస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా?

Quitting Coffee

Quitting Coffee

మనలో చాలామంది ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే లోపు కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. కొందరు కాఫీ తాగితే మరికొందరు టీ తాగుతూ ఉంటారు. అయితే చాలా వరకు ఉదయాన్నే కాఫీతో మొదలు పెడుతూ ఉంటారు. కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ శృతి మించి తాగితే మాత్రం సమస్యలు తప్పవు. అందుకే కాఫీని తాగేటప్పుడు తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. కాఫీ తాగడం మానేయాలి అని చాలామంది అనుకున్నప్పటికీ ఆ అలవాటుని మర్చిపోలేకపోతుంటారు. కాఫీని రెగ్యులర్​ గా తీసుకునేవారికి ఇది మరింత కష్టంగా ఉంటుందట. ముఖ్యంగా మొదటి రోజుల్లో దాని సైడ్​ ఎఫెక్ట్స్ కాస్త ఎక్కువగానే కనిపిస్తాయట.

కానీ తర్వాత మంచి ఫలితాలు చూడగలుగుతారట. అయితే మీరు నెలరోజులు కాఫీ తాగడం మానేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా కాఫీ మానేయడం వల్ల కలిగే నష్టాల విషయానికి వస్తే.. కాఫీని మానేయడం వల్ల మొదటి రోజుల్లో తలనొప్పి ఎక్కువగా ఉంటుందట. రక్తనాళాలను కుదించి మెదడుకు రక్త ప్రవాహం పెరుగుతుందట. దీనివల్ల మైగ్రేన్లు రావచ్చట. శరీరం నెమ్మదిగా పనిచేస్తుందనిపిస్తుందట. కాఫీ నుంచి డోపమైన్ అనే హార్మోన్ ప్రభావితమవుతుందట. దీనివల్ల మీకు కోపం, చికాకు రావచ్చట. పనిమీద ఫోకస్ చేయడం కష్టమవుతుందని, మీ మెదడు కాఫీ లేకుండా ఉండేందుకు కొంత సమయం పడుతుందట.

కాఫీ మానేయడం వల్ల కలిగే లాభాల విషయానికి వస్తే.. కొత్తలో కష్టంగా ఉన్నా కాఫీని మానేయడం వల్ల దీర్ఘకాలిక లాభాలు ఉంటాయట. కాబట్టి మీరు ఆ కొద్ది రోజులు భరిస్తే చాలు తర్వాత రోజుల్లో మంచి ఫలితాలు చూడగలుగుతారట. శరీరం కాఫీ లేకుండా ఉండేందుకు అలవాటు పడుతుంది. కాఫీ మానేయడం వల్ల మీ నిద్ర నాణ్యత పెరుగుతుందట. కెఫిన్ శరీరం నుంచి బయటకు రావడానికి చాలా ఎక్కువ గంటలు పడుతుందట. దీనివల్ల నిద్ర పాడవుతుందని, అదే కాఫీ లేకుండా ఉన్నప్పుడు దాని నాణ్యత పెరుగుతుందని,మధ్య రాత్రి లేవడం తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే తగిన విశ్రాంతి కూడా లభిస్తుందట. కాఫీ మానేసిన కొత్తలో జీర్ణ సమస్యలు కాస్త కనిపిస్తాయి కానీ ఆ తర్వాత కాలంలో అవి పూర్తిగా దూరమవుతాయట. కాఫీ మానేసిన రోజుల్లో మలబద్ధకం కనిపిస్తుందట. కానీ పూర్తిగా కాఫీకి దూరం అవ్వడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందట. కాబట్టి ముందు కంగారు పడకూడదని చెబుతున్నారు. ఆ సమయంలో మీరు జీర్ణ సమస్యలు దూరం చేసుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు. శరీరానికి తగినంత నీరు అందించాలి. ఇది జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలని, ఇవి మలబద్ధకాన్ని దూరం చేస్తాయని, అల్లం టీ, సోంపుతో చేసిన కషాయాలను కాఫీకి రిప్లేస్​ గా తీసుకోవచ్చని చెబుతున్నారు. ఇవి జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయట. చర్మం కూడా హెడ్రేటెడ్​ గా మెరుస్తూ కనిపిస్తుందని చెబుతున్నారు.