సాధారణంగా ఏదైనా గుడ్ న్యూస్ తెలిసిన, ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడినప్పుడు వెంటనే పంచదార ఇచ్చి నోరు తీపి చేసుకోండి అని అంటూ ఉంటారు. కొందరికి ఖాళీగా ఉన్నప్పుడు తినడానికి ఏమీ లేకపోయినప్పుడు పంచదార నోట్లో వేసుకుని తింటూ ఉంటారు. మన దైనందిన జీవితంలో మనం ఈ రోజు తాగే కాఫీ, టీ, జ్యూస్ లలో చక్కరను కలుపుతారు అన్న విషయం తెలిసిందే. అయితే చక్కెర ను అధికంగా తీసుకోవడం వల్ల కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇకపోతే మనం చక్కెర లేకుండా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
స్వీట్లు తక్షణ షుగర్ రష్‌ని అందించడంతో పాటుగా మిమ్మల్ని మంచి మూడ్‌లో ఉంచుతుంది. ఈ షుగర్ రష్ ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మీ మనస్సు స్వయంచాలకంగా ఆహ్లాదకరమైనదాన్ని కోరుతుంది. ధూమపానం కంటే షుగర్ మానేయడం కష్టమని అంటారు. ఎందుకంటే అది అందించే తక్షణ మూడ్ స్వింగ్స్ అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. తరచుగా చక్కెరను తీసుకోవడం వల్ల బరువు పెరగడం, అధిక రక్తపోటు, మధుమేహం, ఫ్యాటీ లివర్, స్ట్రోక్ ముప్పు వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అదనంగా చక్కెర మొటిమలను కలిగించడంతో పాటు చర్మం యొక్క నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది.
ఇకపోతే చక్కెర తినడం మానేయాలని నిర్ణయించుకుంటే,శరీరంలో మొదటి రోజు నుండి మార్పులను గమనించవచ్చు. చక్కెరను తక్కువగా తీసుకోవడం వల్ల మీరు మరింత శక్తివంతంగా అలాగే కొంచెం తేలికగా అనుభూతి చెందుతారు. షుగర్ ను ఒక వారం రోజులు తినకుండా ఉంటే చర్మం శుభ్రపరచబడుతుంది. అలాగే ముఖంలో మొటిమలను తగ్గించి, మీ చర్మం నునుపుగా మరియు లోపలి నుండి మెరిసే విధంగా చేస్తుంది. చక్కెరను కొద్దిరోజుల పాటు తినకుండా ఆపడం వల్ల కలిగే మరోక గొప్ప ప్రయోజనం బరువు తగ్గడం. వేయించిన ఆహారాలు మరియు చక్కెర రెండూ బరువు పెరగడానికి ముఖ్యమైన కారకాలు. మీరు చక్కెరను పూర్తిగా వదులుకుంటే, వేగంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.