Site icon HashtagU Telugu

Quit Smoking Benefits : అకస్మాత్తుగా స్మోకింగ్ మానేస్తే.. మీ శరీరంలో జరిగే మార్పులివే..

Quit Smoking Benefits

Quit Smoking Benefits

Quit Smoking Benefits : మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం అందరికీ తెలుసు. మనం వినోదం కోసం చూసే సినిమా మొదట్లో కూడా ఈ అడ్వర్టైజ్ మెంట్ నే వేస్తారు. అంతెందుకు సిగరెట్ పెట్టెపై కూడా ఇదే రాసి ఉంటుంది. కానీ.. చాలామంది స్మోకింగ్ ను మానలేరు. ఒక్కసారి అలవాటైందా.. దాని పరిధి అంతకంతకూ పెరుగుతుందే తప్ప.. తగ్గదు. ఒత్తిడి తగ్గడానికి సిగరెట్ తాగుతున్నాం అంటారు. నిజానికి సిగరెట్ స్మోకింగ్ కూడా ఒక వ్యసనమే. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుందే తప్ప.. బాగుపడేదేం ఉండదు. ఈ విషయం సిగరెట్ తాగేవారందరికీ తెలిసిందే. అయినా కాని దానిని మానలేరు. పొగతాగేవారికే కాదు.. పీల్చేవారికి కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ మీరు ఉన్నట్టుండి సిగరెట్ మానేస్తే మీ శరీరంలో ఎలాంటి మార్పులొస్తాయో తెలుసుకుందాం.

సిగరెట్ స్మోకింగ్ మానేయడం అంత ఈజీ కాదు. ప్రతిరోజూ సిగరెట్ కాల్చే అలవాటున్నవారు ఒక్కరోజు మానేస్తేనే.. ఆకలి, అలసట, తలనొప్పి, నిద్రలేమి, దగ్గు, మలబద్ధకం వంటి తాత్కాలిక సమస్యలు ఎదురవుతాయి. సిగరెట్ తాగడం వల్ల.. గుండె, హార్మోన్లు, జీవక్రియ, మెదడు సహా.. శరీరంలోని అనేక భాగాలు ప్రభావితమవుతాయి. ఈ రోజులలో కేవలం పురుషులే కాదు.. మహిళలు కూడా సిగరెట్ కు బానిసలయ్యారు.

సిగరెట్ మానేయడం వల్ల వచ్చే సమస్యలు లైఫ్ టైమ్ ఉండవంటున్నారు నిపుణులు. 2-3 వారాల పాటు సిగరెట్ మానేయడంతో ఆకలి, అలసట, తలనొప్పి, నిద్రలేమి, దగ్గు, మలబద్ధకం వంటి తాత్కాలిక సమస్యలు ఉంటాయి. సిగరెట్ మానేశాక.. దానికి మళ్లీ బానిసలవ్వకుండా ఉండాలంటే.. నిపుణుల సలహా మేరకు నికోటిన్ రీప్లేస్ మెంట్ థెరపీ మందులను వాడొచ్చు. సిగరెట్ తాగడం మానేశాక.. మళ్లీ దానిపై మనసు మళ్లితే ఆ కోరిక 15-20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో పాటలు వినడం, వీడియోలు చూడటం, పనిలో నిమగ్నమవ్వడం, ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో మాట్లాడటం వంటివి చేయాలి. అంటే మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. మీరు సిగరెట్ స్మోకింగ్ మానేస్తే.. ఎంత సమయానికి ఏయే మార్పులొస్తాయో చూద్దాం..

20 నిమిషాల పాటు సిగరెట్ మానేస్తే.. బీపీ, హార్ట్ బీట్ బాగుంటుంది. రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది.

8 గంటలపాటు సిగరెట్ మానేస్తే.. రక్తంలో నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు సగానికి తగ్గుతాయి.

12 గంటలు సిగరెట్ తాగకపోతే.. రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేస్తాయి.

24 గంటలు మానేస్తే.. కార్బన్ మోనాక్సైడ్ కరిగి.. దగ్గు ద్వారా గొంతు నుంచి వెళ్లిపోతాయి.

72 గంటలు మానేస్తే.. ఊపిరితిత్తులు మరింత గాలిని పంపిస్తాయి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తగ్గుతాయి.

1-2 వారాలపాటు సిగరెట్ మానేస్తే.. ఊపిరితిత్తుల పనితీరుతో పాటు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

1 నెల మానేస్తే.. రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. చర్మాన్ని పోషిస్తుంది. ముడతలు కూడా తగ్గుతాయి.

15 సంవత్సరాలు సిగరెట్ కు దూరంగా ఉంటే.. గుండెపోటు వచ్చే ప్రమాదం క్రమంగా తగ్గుతుంది.

 

 

Exit mobile version