Cough: దగ్గు సమస్య వేదిస్తోందా.. అయితే ఈ ఆకు నోట్లో వేసుకోవాల్సిందే?

మామూలుగా చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా దగ్గు సమస్య ఇబ్బంది పడుతూ ఉంటుంది. ముఖ్యంగా దగ్గు జలుబు కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటా

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 07:20 PM IST

మామూలుగా చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా దగ్గు సమస్య ఇబ్బంది పడుతూ ఉంటుంది. ముఖ్యంగా దగ్గు జలుబు కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. జలుబు సంగతి పక్కన పెడితే దగ్గు సమస్య కారణంగా చాలా ఇబ్బంది పడటంతో పాటు రాత్రిలో నిద్రపోవడానికి కూడా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఆరోగ్య పరిస్థితిలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. చాలామంది వీటిలో ఎక్కువగా దగ్గు జలుబు జ్వరం వస్తూ ఉంటుంది. చాలామందికి అయితే ఈ దగ్గు జలుబు వంటివి కొన్ని రోజులు ఉండి తగ్గిపోతే పర్వాలేదు.

కానీ ఎక్కువ రోజులు అంటే వారాల తరబడి ఉంటే గనుక కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాల్సిందే. కొంతమందికి అయితే దగ్గు కనీసం ఊపిరి ఆడనివ్వకుండా తరచుగా వస్తూ ఉంటుంది. ఈ దగ్గు సమస్య కొన్ని కొన్ని సార్లు ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. అలాంటప్పుడు ఇంట్లోనే దొరికే కొన్నింటిని ఉపయోగించి ఆ దగ్గు సమస్యకు చెప్పి పెట్టవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ఒక్క తమలపాకు ఒక చిటికెడు వాముతో దగ్గు సమస్య పూర్తిగా పరారైపోతుంది. రోజు తమలపాకు వాము కలిపి వేసుకోవాలి. ఇలా తినడం వలన తలనొప్పి, అధిక ఒత్తిడి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

మనసు, మెదడు ప్రశాంతంగా ఉంటాయి. నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడేవారు రోజు తమలపాకు వాము చేర్చి తింటే నోటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియా నాశనమై బ్యాడ్ స్మెల్ రావడం తగ్గుతుంది..తమలపాకు ఎంత దివ్య ఔషధంగా పనిచేస్తుందో మరి ఇప్పుడు దగ్గు కోసం తమలపాకును ఎలా వాడాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా ఒక తమలపాకును తీసుకుని శుభ్రంగా కడిగి, అలా కడిగిన తర్వాత రెండు చివర్లు కట్ చేయాలి. దానిలో ఒక స్పూను వాముని చేర్చి దానిని మడత పెట్టి ప్రతిరోజు తినాలి. ఇలా తినడం వలన దగ్గు సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.