Site icon HashtagU Telugu

Putnalu Pappu: ప్రతిరోజు పుట్నాల పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

Mixcollage 07 Feb 2024 03 57 Pm 6663

Mixcollage 07 Feb 2024 03 57 Pm 6663

మామూలుగా చాలామంది ఈవినింగ్ సమయంలో స్నాక్స్ గా పుట్నాల పప్పును ఎక్కువగా తింటూ ఉంటారు. మీకు తెలుసా ఈ పుట్నాల పప్పు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. ప్రతిరోజు పుట్నాల పప్పు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. ఇందులో అధిక మోతాదులో ఫైబర్ కూడా లభిస్తుంది. ప్రతిరోజు తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలతో పాటు శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతోపాటు కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది.

ఇందులో కొవ్వు పరిమాణాలు కూడా చాలా తక్కువగా లభిస్తాయి. కాబట్టి శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు సులభంగా తగ్గిపోయి. చెడు కొవ్వు మంచి కొవ్వుగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఈ పప్పులో ఫోలేట్, ఐర‌న్, ఫాస్ప‌ర‌స్, మాంగ‌నీస్ వంటి పోషకాలు అధికం మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పుట్నాల పప్పులలో శరీరానికి అవసరమైన పోషక గుణాలు మినరల్స్ అధిక మోతాదులో లభిస్తాయి. అంతేకాకుండా గుండెకు మేలు చేసే అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి.

కాబట్టి ప్రతిరోజు వీటిని సాయంత్రం పూట స్నాక్స్‌గా తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను కూడా నియంత్రించేందుకు సహాయపడుతుంది. అలాగే ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా పుట్నాల పప్పులో లభించే ఫైబర్ పరిమాణాలు జీర్ణక్రియను మెరుగుపరచి పొట్ట సమస్యలు అయినా మలబద్ధకం, ఉబ్బరం, పొట్టనొప్పి వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో తీసుకోవడం వల్ల వాతావరణంలోని తేమ పెరగడం కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయి. కాబట్టి తరచుగా చలికాలంలో ఇన్ఫెక్షన్ల సమస్యలు, రోగ నిరోధక తగ్గడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పుట్నాల పప్పును తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సాయంకాలం సమయంలో పిల్లలకు స్నాక్స్ గా వీటిని పెట్టడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి.