గుమ్మడి గింజలు (Pumpkin ) మన ఆరోగ్యానికి అపారమైన లాభాలను అందించే ఆహార పదార్థాలలో ఒకటి. సాధారణంగా గుమ్మడి కాయను దిష్టి తీర్చేందుకు మాత్రమే వాడతారు కానీ అందులోని గింజలు ఆరోగ్య పరంగా ఎంతగానో ఉపయోగపడతాయి. వైద్య నిపుణుల చెబుతున్న వివరాల ప్రకారం, గుమ్మడి గింజల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిత్యం కొద్దిగా ఈ గింజలను తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
ఈ గింజల్లో ఉండే ప్రత్యేకమైన పోషకాలు ట్రైగోనెలిన్, నికోటిక్ యాసిడ్, డి-కైరో ఇనోసిటోల్ లాంటి సమ్మేళనాలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. అందుకే మధుమేహం ఉన్నవారు ఈ గింజలను రోజూ ఒక స్పూన్ మేరకు తీసుకోవడం మంచిదిగా వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ఉన్న మెగ్నీషియం, రక్తపోటును సమతుల్యంలో ఉంచేందుకు సహాయపడుతుంది. దీంతో హైబీపీ, లో బీపీ సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Cranberries : ఆరోగ్యానికి క్రాన్‌బెర్రీలు..ఇవి తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?
ఇక నిద్రలేమితో బాధపడే వారికి గుమ్మడి గింజలు ఓ వరమనే చెప్పాలి. ఇందులోని కొన్ని పోషకాల ప్రభావంతో మెదడు ప్రశాంతంగా మారి, నిద్ర నాణ్యత మెరుగవుతుంది. ముఖ్యంగా రాత్రి పూట తినితే మంచి ఫలితం కనిపిస్తుంది. అన్నీ చూస్తే.. చిన్నచిన్న గింజలే అయినా, ఆరోగ్యానికి ఇచ్చే లాభాలు మాత్రం విస్తరించేవే. రోజుకు ఒక్క స్పూన్ గుమ్మడి గింజలు తీసుకోవడం ద్వారా మన శరీరం ఆరోగ్యవంతంగా మారుతుందన్నది నిపుణుల సూచన.