Site icon HashtagU Telugu

Pumpkin : ఈ కూరగాయలో యవ్వన రహస్యం దాగి ఉంది..దీన్ని తింటే బరువు తగ్గుతారు.!!

Pumpkin Juice

Pumpkin Juice

గుమ్మడికాయ చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ దానిలో ఉన్న ఆరోగ్యప్రయోజనాలు తెలుస్తే అస్సలు వదిలిపెట్టరు. గుమ్మడికాయ వల్ల శరీరానికి లెక్కలేనన్ని లాభాలు ఉన్నాయి. తరచుగా మార్కెట్లో గుమ్మడికాయలు చూసే ఉంటారు. ఇందులో ఆకుపచ్చ, పసుపు పచ్చవి మాత్రమే చూసి ఉంటారు. కానీ ప్రపంచం మొత్తంమీద `150 రకాల కంటే ఎక్కువ రకాల గుమ్మడికాయలు ఉన్నాయి. దీనిపై అనేక రకాల విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కళ్ళ నుంచి గుండె వరకు ఆరోగ్యానికి కాపాడుతాయి. అంతేకాదు ఎముకలను బలపరస్తుది. శరీరంలో రోగనిరోధకశక్తినికూడా పెంచుతుంది. గుమ్మడికాయ ప్రయోజనాలేంటో చూద్దాం.

కంటిచూపు
మీ కంటి చూపును మెరుగుపరచడంలో గుమ్మడికాయ సహాయపడుతుంది. కంటికి అవసరమైన విటమిన్ ఏ ఇందులో అధికంగా ఉంటుంది. ఇది కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక రోజుకు సరిపడే విటమిన్ ఏ…ఒక కప్పు గుమ్మడికాయలో లభిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది కంటి శుక్లాల్లో అంధత్వం రాకుండా సహాయపడుతుంది.

రోగనిరోధకశక్తికి..
ఇందులో విటమిన్ ఏ తోపాటు విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధకశక్తికి చాలా అవసరం. న్యూట్రోఫిల్స్ పనితీరుకు విటమిన్ సీ అవసరం. న్యూట్రోఫిల్స్ అనేది రోగనిరోధక కణం. ఇది మన శరీరంలో పలు రకాల హానికరమైన బ్యాక్టీరియాలను నిర్మూలించడంలో పనిచేస్తాయి. గుమ్మడికాయను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

బరువు తగ్గడానికి
పొటాషియం కేవలం అరటిపండులోనే కాదు గుమ్మడికాయలోనూ ఉంటుంది. పురుషునికి రోజూ 3.400గ్రాములు, స్త్రీకి 2,400గ్రాముల పొటాషియం అవసరం. ఒక అరకప్పు వండిన గుమ్మడికాయలో 250మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. ఇది శరీరానికి చాలా అవసరం. మీరు తరచుగా ఆహారంలో చేర్చినట్లయితే..బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తరచుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇందులో పోషకాలుఎక్కువ క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
గుమ్మడికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గుమ్మడికాయను తింటే చాలా సమయం వరకు ఆకలిగా అనిపించదు. కడుపు నిండుగా ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను అనుమతించదు. అంతేకాదు ప్రేగుల ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో చక్కెరస్థాయిని కంట్రోల్లో ఉంచుతుంది.

ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు
ఇది మీ చర్మాన్నిజాగ్రత్తగా చూసుకుంటుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, ఐరన్, జింక్, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు చర్మకణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. గుమ్మడికాయలో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతుంది.

 

 

Exit mobile version