Site icon HashtagU Telugu

Smart Phone: చీకట్లో మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా.. అయితే జాగ్రత్త?

Mixcollage 08 Jul 2024 11 21 Am 7276

Mixcollage 08 Jul 2024 11 21 Am 7276

ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ల వాడకం ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ఒక పూట ఆహారం లేకపోయినా ఉండగలరేమో కానీ మొబైల్ ఫోన్ యూస్ చేయకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు అర్ధరాత్రి వరకు కూడా ఈ మొబైల్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తూ మొబైల్ ఫోన్లకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే చాలామంది చీకట్లో అనగా బెడ్రూంలో లైట్లు ఆఫ్ చేసుకుని అలాగే రాత్రి సమయంలో కూడా అర్ధరాత్రి వరకు చీకట్లోనే మొబైల్ ని చూస్తూ ఉంటారు.

దీనివల్ల కంటిపై తీవ్రంగా ప్రభావం పడుతుంది అన్న విషయం తెలిసిందే. అయినా కూడా చాలామంది ఈ విధంగానే మొబైల్ ఫోన్ ని యూస్ చేస్తూ చిన్న వయసులోని కళ్ళు చూపు సమస్యలను తెచ్చుకుంటున్నారు. అయితే ఈ విధంగా చీకట్లో మొబైల్ ఫోని ఉపయోగిచడం అసలు మంచిది కాదు అంటున్నారు వైద్యులు. మరి ఇలా మొబైల్ ఫోన్ ఇస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చీకట్లో మొబైల్ ఫోన్ వాడటం వల్ల మొబైల్ ఫోన్ నుంచి వచ్చే ఆ వెలుతురు కంటి పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. క్రమంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే చాలామంది స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ తో బాధపడుతుంటారు. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌ల వంటి డిజిటల్ పరికరాలను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల వస్తుంది.

దీని వల్ల కళ్లు పొడిబారడం, కంటి చూపు మందగించడం, దృష్టి మసక బారడం, తలనొప్పి, మెడ, భుజాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ వ్యాధి స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించడానికి, తరచుగా విరామం తీసుకోవడం, స్క్రీన్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్‌ని సర్దుబాటు చేయడం, పరికరాన్ని కళ్లకు దూరంగా ఉంచడం, కళ్లను తేమగా ఉంచడానికి కృత్రిమ కన్నీళ్లను ఉపయోగించడం మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగించడం మంచిదే కానీ అలా అని ఎక్కువసేపు ఉపయోగించడం మంచిది కాదు. గంటల తరబడి స్మార్ట్ ఫోన్ వినియోగించేవారు ఇకమీదట అయినా స్మార్ట్ ఫోన్ ని వినియోగించుకోవడం తగ్గించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.