Health Tips: వామ్మో.. ప్రతిరోజు అన్నం తింటే ఏకంగా అన్ని రకాల సమస్యలు వస్తాయా?

మనలో చాలామంది మూడు పూటలా అన్నాన్ని తింటూ ఉంటారు. ఇంకొందరు మాత్రమే ఒక పూట టిఫిన్ లాంటివి తిని మిగతా రెండు పూటలా అన్నాన్ని తింటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 04:00 PM IST

మనలో చాలామంది మూడు పూటలా అన్నాన్ని తింటూ ఉంటారు. ఇంకొందరు మాత్రమే ఒక పూట టిఫిన్ లాంటివి తిని మిగతా రెండు పూటలా అన్నాన్ని తింటూ ఉంటారు. అయితే అన్నం ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు వైద్యులు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న కూడా ఇది నిజం. అన్నం ఎక్కువగా తింటే కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయట. మరి ప్రతిరోజు అన్నం తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రోజులో కనీసం ఒక్కసారైనా కూడా అన్నం తినందే ఎవరికి ఆహారం తీసుకున్నట్టుగా ఉండదు. మీకు తెలుసా ఇలా అన్నము ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయట.

అన్నం ఎక్కువగా తింటే ఈజీగా లావవుతారు. అందుకే డైటింగ్ చేసే వారు అన్నంత తక్కువగా తీసుకుంటారు. అన్నం త్వరగా కడుపు నింపుతుంది. కానీ అతిగా తినడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. అన్నం తినగానే పడుకుంటే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే భోజనం చేసిన తర్వాత కాస్త వాకింగ్ చేయడం బెటర్. మధుమేహం ఉన్న వారు రాత్రి పూట అన్నం తినకపోవడమే మంచిది. ఒక వేళ తింటే అది వ్యాధి ప్రభావాన్ని మరింతగా పెంచే చాన్స్ ఉంది. ఫలితంగా బాడీలో షుగర్ లెవల్ సైతం పెరుగుతుంది. చాలా మందికి బియ్యం తినడం అలవాటుగా ఉంటుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే చాన్స్ ఉంటుంది. అన్నం ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట.

మరి ప్రతి రోజూ ముడు పూటలు అన్నం తినే వారు ముందు నుంచే కాస్త జాగ్రత్త పడాలి మరి. లేదంటే సమస్యలకు గురి కాక తప్పదు.. కాబట్టి అన్నం తినడం మంచిదే కానీ మూడు పూటలా అన్నం తినడం అసలు మంచిది కాదు. ఒక పూట చపాతీ మరొక పూట రాగి సంగటి, జొన్న రొట్టె సద్ద రొట్టె లాంటివి చేసుకొని తినడం వల్ల వాటి వల్ల ప్రయోజనాలను పొందడంతో పాటు అన్నం వల్ల కలిగే సమస్యలకు చెక్ పెట్టవచ్చు.