Pregnant Women: గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు తీసుకోవాల్సిన జ్యూసెస్ ఇవే?

స్త్రీ లకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. పెళ్లి అయిన ప్రతి ఒక మహిళ కూడా తల్లి అవ్వాలని ఎంతో

  • Written By:
  • Publish Date - March 31, 2023 / 06:33 AM IST

స్త్రీ లకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. పెళ్లి అయిన ప్రతి ఒక మహిళ కూడా తల్లి అవ్వాలని ఎంతో ఆశపడుతూ ఉంటుంది. కానీ కొంతమంది పెళ్లి అయి కొన్నేళ్లు అయినా కూడా పిల్లలు కలగక గుళ్ళు, గోపురాలు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే అయితే గర్భం దాల్చిన మహిళలు బిడ్డ పుట్టే వరకు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా గర్భం సమయంలో మహిళల్లో అనేక రకాల మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే శరీరంలో విడుదల అయ్యే హార్మోన్లు బరువు పెరగడానికి అలాగే ఎద భాగం పెరగడానికి కారణం అవుతాయి.

అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు మహిళలు తెలిసి, తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అలాగే పుట్టే బిడ్డలు అందంగా పుట్టాలని ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా అందంగా పుట్టాలి అంటే ప్రతిరోజు గర్భిణీ స్త్రీలు కొన్ని రకాల జ్యూస్ లు తీసుకోవాలి. మరి ఎటువంటి జ్యూస్ లు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గర్భిణీ స్త్రీలు పండ్లు, రసాలను తీసుకోవడం వలన గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీలు తీసుకునే జ్యూసెస్‌లో తప్పకుండా ఈ జ్యూసెస్ ఉండేలా చూసుకోవాలి. అందులో మొదటిది అవకాడో జ్యూస్. ఇది గర్భధారణ సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

దీని వల్ల ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ఫోలేట్ ఎనర్జీని అందిస్తాయి. కడుపులోని పిండం సక్రమంగా అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి. అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన వాటిలో కరబూజ రసం కూడా ఒకటి. ఈ జ్యూస్ వల్ల గర్భిణీ స్త్రీలలో జీర్ణ సమస్యలు రావు. అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన మరొక జ్యూస్ పుచ్చకాయ రసం.
పుచ్చకాయ రసంలో ఉండే బీటా కెరోటిన్, మెగ్నీషియం, జింక్, క్రోమియం, సహజ చక్కెరలు శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ట్రీ యాపిల్ జ్యూస్ కూడా జీర్ణ సమస్యలకు త్వరిత పరిష్కారం చూపుతుంది. ఇందులోని పొటాషియం, విటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాపిల్ జ్యూస్‌లో విటమిన్లు ఎ,సి మినరల్స్ ఉంటాయి. ఇది అలసటను, అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. నిద్రలేమికి పరిష్కారం చూపిస్తుంది. దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వలన రక్త ప్రసరణ మెరుగవుతుంది. పిల్లల్లో మెదడు క్షీణతకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.