Pregnant Diet Tips: శీతాకాలంలో గర్భిణీలు ఈ పదార్థాలు తింటే చాలు.. బేబీ అందంగా పుట్టడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు?

పెళ్లయిన ఆడవారికి తల్లి అవడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. కానీ కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది

  • Written By:
  • Publish Date - January 12, 2023 / 06:30 AM IST

పెళ్లయిన ఆడవారికి తల్లి అవడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. కానీ కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రస్తుత సమాజంలో చాలామంది పిల్లలు కలగక, గుళ్ళు గోపురాలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇకపోతే గర్భవతిగా ఉన్న మహిళలు ఎన్నో రకాల జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. గర్భవతి అని తెలిసినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా ఎన్నో రకాల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.అలాగే చలికాలంలో గర్భిణీ స్త్రీలు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల పుట్టే బేబీ అందంగా పుట్టడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. మరి శీతాకాలంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చలి కాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో డ్రైఫ్రూట్స్ తప్పనిసరి. బాదం, జీడీపప్పు, వాల్ నట్స్ వంటివి కచ్చితంగా తినాలి. ఇందులో విటమిన్లు, పోలేట్, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. బాదం ఎక్కువ తింటే కడుపులో బిడ్డ ఎముకలు, దంతాల వృద్ధికి సాయం చేస్తుంది. అయితే ప్రాసెస్ చేసిన డ్రైఫ్రూట్స్ మాత్రం అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతి రోజు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో గుడ్డు ఒకటి. అందుకే అంగన్వాడి స్కూల్లో ఎక్కువగా గర్భవతులకు గుడ్లు ఇస్తూ ఉంటారు. గుడ్లలో కోలిన్, లుటిన్, విటమిన్లు డీ, బీ12, రిబోఫ్లెవిన్, ఫోలేట్ వంటి పోషకాలు గుడ్డు తినే గర్భిణులకు అందుతాయి. గుడ్డు తినడం కడుపు ఉండే శిశువు ఎముక, కండరాల అభివృద్ధి సహాయపడుతుంది.

అలాగే శీతాకాలంలో లభించే బచ్చలి కూర, మెంతి కూర వంటి ఆకు కూరలు తింటే గర్భిణులు చాలా మేలు జరుగుతుంది. ఇవి తినడం వల్ల అందులో ఉండే విటమిన్లు ఏ, సి, కె తో పాటు కాల్షియం, ఐరన్, ఫోలెట్, పొటాషియం వంట పోషకాలు శరీరానికి అందుతాయి. చాలామంది గర్భిణీలో చేపలు తినడానికి ఇష్టపడరు.. కానీ చేపల్లో రకాలైన సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు చేపలను గర్భిణులు తీసుకుంటే చాలా మంచిది. వీటిల్లో ఉండే ఓమెగా 3 వంటి ఆమ్లాలు అద్భుత స్థాయిల్లో ఉంటాయి. జింక్, సెలినియం, విటమిన్ డి కూడా పుష్కలంగా లభిస్తాయి. చిక్కుడు, బీన్స్ వంటి గింజ ఆహారాల్లో పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు, వేరుశెనగల్లో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, ఇనుము, ఫైటో కెమికల్స్ వంటివి ఉంటాయి. వీటిని గర్భిణులు తీసుకుంటే నాణ్యమైన పాలను ఉత్పత్తి చేయడానికి సాయం చేస్తాయి.