Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఈ పండ్లను తింటున్నారా..తింటే గర్భస్రావం అవుతుందట.?

సాధారణంగా ప్రెగ్నెన్సీ మహిళలు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తినే విషయంలో కూర్చునే

  • Written By:
  • Publish Date - October 31, 2022 / 08:30 AM IST

సాధారణంగా ప్రెగ్నెన్సీ మహిళలు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తినే విషయంలో కూర్చునే విషయంలో పడుకునే విషయంలో ఇలా ప్రతి ఒక్క విషయంలో అనేక రకాల జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆహారం విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంచి మంచి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటూ ఉంటారు. కానీ గర్భిణీ స్త్రీలకు గర్భవతిగా ఉన్నప్పుడు రకరకాల పదార్థాలు తినాలని కోరిక పుడుతూ ఉంటుంది. అలా తింటే కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం. అలాగే గర్భంతో ఉన్న మహిళలు కొన్ని రకాల పండ్లను తింటే గర్భస్రావం కూడా అవుతుందట..

మరి ఆ పండ్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా గర్భధారణ సమయంలో పైనాపిల్ పండును అస్సలు తినకూడదు. ఇలా తినడం వల్ల గర్భాశయం సంకోచానికి గురుగుతుంది. పైనాపిల్ లో ఉండే బ్రోమెలైన్, ప్రోటీన్లను విచినం చేసి గర్భాశయాన్ని మృదువుగా మార్చడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే గర్భధారణ సమయంలో చింతపండును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల కంటే ఆరోగ్య సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. చింతపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. చింతపండును తీసుకోవడం వల్ల అందులో ఉండే ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని అణిచివేసి తక్కువ స్థాయిలో గర్భస్రావానికి దారితీస్తాయి.

గర్భవతిగా ఉన్నప్పుడు మొదటి ఆరు నెలలు చింతపండును అస్సలు తినకూడదు. బొప్పాయిని గర్భిణి స్త్రీలు అస్సలు తినకూడదు. బొప్పాయిని తినడం వల్ల గర్భస్రావం కూడా అవుతుంది. అంతే కాకుండా కొన్ని సమయాలలో కడుపులోని పిండం ఎదుగుదలను నిరోధించగలదు. అలాగే గర్భధారణ సమయంలో అరటి పండ్లు తినడం తినడం మంచిదే కానీ కొన్ని సమయాలలో అది కూడా ఆరోగ్య నిపుణుల సూచన మేరకు మాత్రమే తినాలి. గర్భధారణ సమయంలో పుచ్చకాయను తినడం వల్ల కడుపు లోని బిడ్డకు పుచ్చకాయ నుంచి బయటకు వచ్చే విష పదార్థాలు హాని చేస్తాయి. అందుకే ఈ పండును గర్భిణులు తినకపోవడమే మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు ఖర్జూరాన్ని కూడా తినకూడదు.