Winter Tips: చలికాలం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం.. అవేంటంటే?

చలికాలం మొదలయ్యింది. దీంతో రాత్రి సమయాల్లో కొన్ని ప్రదేశాలలో అప్పుడే చలి మైనస్ డిగ్రీ సేల్స్ లో కూడా

  • Written By:
  • Publish Date - October 29, 2022 / 09:30 AM IST

చలికాలం మొదలయ్యింది. దీంతో రాత్రి సమయాల్లో కొన్ని ప్రదేశాలలో అప్పుడే చలి మైనస్ డిగ్రీ సేల్స్ లో కూడా నమోదు అవుతోంది. ఇక పల్లెటూర్లలో అలాగే మీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో చలి వణికిస్తోంది. చలికాలంలో కేవలం చలి మాత్రమే కాదు ఎన్నో రకాల వైరస్లు కూడా వస్తూ ఉంటాయి. చలికాలంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. కాబట్టి వృద్ధులు, చిన్నపిల్లలు వారి ఆరోగ్యం పై శ్రద్ధ చూపడంతో పాటు వారిని ఎక్కువగా చలికిఉండకుండా చూసుకోవాలి. అలాగే చలికాలంలో ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారాలు తినకూడదు ఎప్పటికప్పుడు వేడివేడిగా ఉన్న పదార్థాలను మాత్రమే తినాలి. చలికాలంలో వెచ్చదనం కోసం చాలా మంది టీలు, కాఫీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు.

వాటికీ బదులుగా గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు శరీరం వెచ్చగా ఉంటుంది. చలికాలంలో వచ్చే జలుబు దగ్గు జ్వరం లాంటివి దరిచేరకుండా ఉండాలి అంటే ఇంట్లో పరిశుభ్రతను పాటించాలి. అలాగే చలికాలంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి పోషకాహారాలు ఉన్న ఆహార పదార్థాలతో పాటు విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి. అలాగే చలికాలంలో బయట దొరికే ఫుడ్ ని తినడం వల్ల ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందువల్ల ఇంట్లో చేసుకొని తినడం మంచిది. చలికాలం ముసలి వారు చిన్న పిల్లలు ఉన్ని దుస్తులను ధరించాలి. అలాగే వెచ్చగా ఉండటం కోసం ఒక గులు దుప్పట్లను కప్పుకోమని చెప్పాలి.

అలాగే చలి కాలము ఉదయాన్నే ప్రయాణం చేయవలసి వస్తే చేతులకు గ్లౌజులు , కాళ్లకు సాక్స్ లు, మంకీ క్యాప్ అలాగే చెవిలో దూది పెట్టుకోవడం మంచిది. చలికాలం చల్లని నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే చలికాలం చాలామందికి పెదవులు పగులుతూ ఉంటాయి. కొంతమందికి అయితే రక్తం కూడా వస్తూ ఉంటుంది. అటువంటివారు రాత్రి సమయంలో పడుకునే ముందు విన్న లేదంటే లిబ్బం లాంటిది అప్లై చేసుకుని పడుకోవాలి. సాయంత్రం కాగానే కిటికీలను మూసివేయాలి. ఏసీలను ఉపయోగించకూడదు. అలాగే చలికాలం వీలైనంత త్వరగా భోజనం చేసి పడుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది.