Site icon HashtagU Telugu

Thyroid Patients : థైరాయిడ్‌ పేషెంట్స్‌ సమ్మర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Thyroid Patients

Thyroid Patients

థైరాయిడ్‌ (Thyroid ) అనేది ఇప్పుడు చాలామందిని ఎంతో బాధకు గురిచేస్తుంది. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా చాలామందికి ఈ థైరాయిడ్‌ అనేది వస్తుంది. ఈ థైరాయిడ్‌ మనిషిలో అనేక అనారోగ్యాలకు గురి చేస్తుంది. ముఖ్యంగా ఆడవారు ఈ థైరాయిడ్‌ బారిన ఎక్కువగా పడుతున్నారు. అయితే ఈ థైరాయిడ్‌ బారినపడినవారు సమ్మర్ లో తప్పకుండ జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవడం వల్ల ఎంతో మంచిదని చెపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

థైరాయిడ్‌ తో బాధపడుతున్నవారు.. డాక్టర్‌ సూచించిన మెడిసిన్ ను క్రమంతప్పకుండా సరైన మోతాదులో తీసుకోవడం మంచిది. డోసు మార్చుకోవడం లేదా మందులు ఆపడం వంటివి చేయకూడదు. అలాగే ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా వీరు ఐయోడైజ్డ్‌ ఉప్పు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు, మాంసం వంటివి తీసుకోవాలని చెపుతున్నారు. ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. ఈ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు సైక్లింగ్ తో పాటు వాకింగ్, స్లిమ్మింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు.

అలాగే థైరాయిడ్‌ తో బాధపడేవారు బరువు పెరగడం సాధారణం. కాబట్టి పెరుగుతున్న బరువును సులభంగా నియంత్రించుకునే పద్ధతులను అనుసరించడం మంచిదని అంటున్నారు. ఇక వీరికి కోపం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో యోగాతో పాటు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గే అవకాశాలున్నాయి.

Read Also : CJI : సుప్రీం, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు.. సీజేఐ లేఖ