Site icon HashtagU Telugu

Leg Cramps: తరచుగా కాళ్ల తిమ్మిర్లు వస్తున్నాయా..?ఇలా చేయండి..!!

Leg pain

Leg Cramp

కొందరికి కాలి కండరాలు పట్టేస్తుంటాయి. ఇంకొంతమంది తరచుగా ఈ సమస్య తలెత్తుతుంది. కాళ్లు తిమ్మిరెక్కుతుంటాయి. ఆ సమయంలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఎటూ కదల్లేరు. కాలు కింద పెట్టలేరు. నొప్పితో విలవిలాడుతుంటారు. అసంకల్పిత సంకోచం, కండరాల బిగుతు ఫలితంగా కండరాలు విశ్రాంతి తీసుకోలేకపోవడం వల్ల తిమ్మిర్లు ఏర్పాడుతాయి. ఎక్కువసేపు కూర్చోని పనిచేయడం, గాయం మొదలైన కారణాలు వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. అయితే తిమ్మిర్ల సమస్య తగ్గేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెప్పారు అవేంటో చూద్దాం.

1.నీళ్లు ఎక్కువ‌గా తాగాలి..!

డీహైడ్రేష‌న్ వ‌ల్ల కూడా కాళ్లు తిమ్మిరెక్కుతాయి. ఈ స‌మ‌స్య‌ నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే రోజులో ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతుండాలి. శ‌రీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

2. ఐస్‌తో మ‌సాజ్ చేయాలి..!

వాపు నుంచి తిమ్మిర్ల‌వ‌ర‌కూ ఎలాంటి నొప్పి అయినా సరే త‌గ్గించుకోవాలంటే ఐస్‌తో మ‌సాజ్ చేయాలి. ఓ గుడ్డ‌లో ఐస్‌ముక్కలు వేసి నొప్పి ఉన్న‌చోట గట్టిగా రుద్దాలి. ఇలా చేస్తుంటే తిమ్మిర్లు, నొప్పి త‌గ్గిపోతాయి.

3. కాళ్ల‌ను స్ట్రెచ్ చేస్తూ ఉండాలి..!

కాళ్లు తిమ్మిరెక్కిన‌ప్పుడు కానీ ప‌ట్టేసిన‌ప్పుడు కానీ అలాగే కూర్చోకూడదు. నొప్పి ఉన్న కాలును స్ట్రెచ్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల తిమ్మిరి, నొప్పి త‌గ్గిపోతుంది.

4. మసాజ్ చేయాలి..!

కాలు తిమ్మిరి వచ్చిన చోట లేదా నొప్పి క‌లిగిన‌చోట ఆయిల్‌తో మ‌సాజ్ చేయాలి. ఇలా చేయ‌డం చేస్తే కండ‌రాలు రిలాక్స్‌ అవుతాయి. కండ‌రాల తిమ్మిరిని తగ్గించడంలో ఇది చాలా ప్ర‌భావవంతంగా ప‌నిచేస్తుంది.

5. విశ్రాంతి ఇవ్వండి..!

తిమ్మిరి ఉన్న కాలును పైకి ఎత్తి ఉంచాలి. దాన్ని నొప్పి త‌గ్గేవ‌ర‌కూ అలాగే ఉంచుతూ..త‌గినంత విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే నొప్పి దానికంత‌ట అదే త‌గ్గిపోతుంది.