Pregnancy Precautions: గర్భిణి మ‌హిళ‌లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లివే..!

ప్ర‌తి మ‌హిళ‌కు అమ్మ కావాల‌నే కోరిక ఉంటుంది. అమ్మ కావ‌డం దేవుడిచ్చిన వ‌రంతో స‌మానం.

  • Written By:
  • Updated On - September 26, 2022 / 02:09 PM IST

ప్ర‌తి మ‌హిళ‌కు అమ్మ కావాల‌నే కోరిక ఉంటుంది. అమ్మ కావ‌డం దేవుడిచ్చిన వ‌రంతో స‌మానం. ఈ సృష్టిలో అమ్మ కావ‌డం అనేది ఆడ‌వాళ్ల‌కు మాత్ర‌మే ద‌క్కిన అదృష్టం. త‌న క‌డుపులో 9 నెల‌లు మోసి ఒక ప్రాణాన్ని ఈ లోకానికి ప‌రిచయం చేస్తోంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే గర్భిణీ మ‌హిళ‌లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కచ్చితంగా తెలుసుకోవాలి. గర్భధారణ మొద‌టి రోజు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి..? వాటి ప‌రిష్కారాలెంటో తెలుసుకోవ‌డం ముఖ్యం.

గర్భధారణ సమయంలో మహిళలు వారి ఆహారం ఇంకా అలాగే పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భిణీ స్త్రీ తన ఆహారంలో ఆరోగ్యకరమైన ఇంకా పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా తల్లి.. ఇంకా బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.

గర్భిణులు చేయ‌కూడ‌ని ప‌నులు

– కొంతమందికి కాఫీ, టీలు ఎక్కువగా తాగుతుంటారు. కానీ గర్భం దాల్చిన సమయంలో వీటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిదని వైద్యులు అంటున్నారు. వీటిల్లో ఉండే కెఫిన్‌ బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతంది.

– ఒకే దగ్గర ఎక్కువ స‌మ‌యం కూర్చోకూడదు. నడుస్తూ ఉండాలి. న‌డ‌వ‌టం శరీరానికి వ్యాయ‌మంలా పని చేస్తుంది.

– మరిగిన వేడి నీటితో స్నానం చేయడం గర్భిణులకు మంచిది కాదు. స్నానం చేయాల‌నుకుంటే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.

– ముఖ్యంగా గర్భిణులు బయటకు వెళ్లేటప్పుడు కాళ్ల‌కు ధ‌రించే చెప్పుల విష‌యంలో ఎంపిక ముఖ్యం. మూములుగా ఉన్న చెప్పులను మాత్రమే ధరించాలి. హై హీల్స్ లాంటివి అస‌లు వేసుకోకూడదు.

– గర్భం దాల్చిన రోజు నుంచి ప్రసవం అయ్యేంత వరకు గర్భిణులు ఎన్నో జాగ్రత్త‌లు పాటించాలి. బరువులు మోయడం లాంటివి అసలు చేయకూడదు. బ‌రువులు మోస్తే తల్లి, బిడ్డకు ఎంతో ప్రమాదకరం.

– గర్భం దాల్చిన మ‌హిళ అనారోగ్యంకు గురైతే త‌న‌కు చెక‌ప్ చేసే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి. ఆ వైద్యుల‌ సూచ‌న మేర‌కే మందులు తీసుకోవాలి.

గర్భిణులు చేయాల్సిన పనులు

– ఈ సమయంలో గర్భం దాల్చిన మ‌హిళ ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో ఉండాలి. ఎలాంటి భయాందోళనలు లేకుండా ఉండాలి. ప్రశాంతమైన వాతావరణాన్ని చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి.

– తల్లి కదలికను బట్టి కడుపులో ఉన్న బిడ్డ స్పందిస్తూ ఉంటుంది. అందువల్ల తల్లి ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. త‌ల్లి క‌దలిక‌పై బిడ్డ స్పంద‌న‌లు ఆధార‌ప‌డి ఉంటాయి.

– భయాందోళనలు కలిగించే దృశ్యాలు, పెద్ద పెద్ద అరుపులు, గొడవలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఖాళీ స‌మ‌యాల్లో మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి.

– మంచి సంగీతాన్ని వినాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో ఎంత ఎక్కువ ఆహారం తీసుకుంటే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటారు. కావాల్సిన నిద్ర పోవాలి. ఎంత ఎక్కువ సేపు నిద్ర‌పోతే త‌ల్లి, బిడ్డ‌కు అంత మంచిది.