ప్రస్తుత కాలంలో జీవన ప్రమాణాలు పెరిగాయి. పట్టణాల్లో బతకడం చాలా కష్టమైపోతోంది. ఇద్దరున్న ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ కలిసి సంపాదిస్తేనే…జీవితం సుఖంగా ముందుకు సాగుతుంది. అలాంటి సమయంలో స్త్రీ తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తోంది. ఉద్యోగం చేస్తున్న స్త్రీలు గర్భం దాల్చినట్లయితే ఆ క్షణాలు వారికి చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె జీవితంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అయితే ఈ రోజుల్లో చాలా మంది మహిళలు గర్భాన్ని తేలికగా తీసుకుంటున్నారు.
ఎందుకంటే గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అలాంటివేం పట్టించుకోకుండా ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన రోజు నుంచే ఉద్యోగాలకు హాజరవుతున్నారు. ఇలా చేస్తే గర్భిణీలు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవల్సి వస్తుంది. కొంతమంది డెలివరీ అయ్యేంత వరకూ ఉద్యోగానికి వెళ్తుంటారు. అలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు తగినటువంటి కొన్ని సూచనలు తూచా తప్పకుండా పాటించాలని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో స్త్రీ గర్భాశయం పెరుగుతుండంతో పొత్తికడుపు కండరాలను బలహీనపరుస్తుంది. పొత్తికడుపు ప్రాంతంలో బిడ్డ పెరిగేకొద్దీ…వెన్నుముక వంగుతుంది. దీంతో స్త్రీకి వెన్నుముక ప్రాంతంలో ఒత్తిడిని కలిగిస్తుంది. గర్భాధారణ సమయంలో లేదా ప్రసవానంతర తర్వాత కూడా ఈ నొప్పి బాధపెడుతుంది. బొడ్డు ప్రాంతంలో బరువు పెరుగుతుండంతో…లేదా హార్మోన్ల మార్పుల కారణంగా అభివృద్ధి చెందే లార్డోటిక్ కారణంగా 60శాతం కంటే ఎక్కువ మంది మహిళలు గర్భాధారణ సమయంలో నడుము నొప్పితో బాధపడుతుంటారు.
ప్రసవ సమయంలో హార్మోన్ల ప్రభావం
గర్భధారణ లేదా ప్రసవ సమయంలో హార్మోన్లలో మార్పులు స్త్రీ శరీరంపై ప్రభావం చూపుతాయి. పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అయితే గర్భధారణ సమయంలో వచ్చే నడుము నొప్పిని విస్మరిస్తే…అది వెన్నుముక బలహీనతకు దారితీస్తుంది. ఆరోగ్యవంతమై ప్రసవాన్ని పొందేందుకు ప్రతి స్త్రీ కూడా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. చాలామంది మహిళలు గర్బాధారణ సమయంలో ఉద్యోగం చేస్తే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వికారం, వాంతులు:
దీనిని ఉదయం సిక్ నెస్ అని పిలుస్తారు. గర్బం దాల్చిన తర్వాత వికారం, వాంతులు అనేది మామూలుగా జరుగుతూనే ఉంటుంది. ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో వికారం, వాంతులు కలిగించే వాసనలకు దూరంగా ఉండాలి. తరచుగా వికారంగా అనిపించినప్పుడు చప్పగా ఉండే ఆల్పాహారం తీసుకోవడం మంచిది. అల్లం టీ కూడా ఎంతో సాయపడుతుంది. ‘
అలసటగా అనిపిస్తే:
మీరు ఎక్కువ సమయం పనిచేయడం వల్ల మీ శరీరం అలసిపోతుంది. పనిదినాల్లో విశ్రాంతి తీసుకోవడం కుదరకపోవచ్చు. ఐరన్ , ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఐరన్ లోపం వల్ల అలసట అనిపిస్తుంంది. రెడ్ మీట్, ఫౌల్ట్రీ, సీఫుడ్, లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్, ఐరన్ ఫోర్టిఫైడ్ , బీన్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
విరామం తీసుకోవం :
ఆఫీసులో పనిచేస్తున్న సమయాల్లో కొన్ని నిమిషాలపాటు విరామం తీసుకోవడం మంచిది లేదా కొద్దిసేపు వాకింగ్ కూడా ఆరోగ్యానికి మంచిది. మీ డెస్క్ వద్ద వాటర్ బాటిల్ పెట్టుకోండి. ప్రతి పది, పదిహేను నిమిషాలకోసారి నీళ్లు తాగడం మంచిది. శారీరక శ్రమను తగ్గించడంలో వ్యాయామం సహాయపడుతుంది. రోజంతా డెస్క్ లో కూర్చుంటే..మీ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రినేటల్ ఫిట్ నెస్ క్లాస్ లో చేరండి.
ఎనిమిది గంటల నిద్ర :
ఇక ప్రతిరోజూ దాదాపు ఎనిమిది గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. ఎడమ వైపు తిరిగి పడుకోవడం చాలామంచిది. ఎందుకంటే బిడ్డకు రక్తప్రసరణ అనేది సరిగ్గా జరుగుతుంది. గర్భం పెరిగే కొద్దీ కూర్చోవడం, నిలబడటం రోజువారీ కార్యకలాపాలు అసౌకర్యంగా అనిపిస్తాయి. అలసటగా అనిపించినట్లయితే కొద్దిసేపు విరామం తీసుకోవడం మంచిది.
ఒత్తిడిని తగ్గించుకోవడం :
ఉద్యోగం చేసే గర్భిణీలు ఒత్తిడికి దూరంగా ఉండాలి. రోజు చేయాల్సిన పనులు జాబితాను ముందే రూపొందించుకోండి. వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. పనివేళలో మీకు సపోర్టుగా ఉండే సహోద్యోగి, స్నేహితులతో ఒత్తిడికి సంబంధించిన విషయాలను చర్చించండి. రిలాక్స్ గా ఉండటం చాలా అవసరం. నెమ్మదిగా శ్వాసతీసుకోవడం, ప్రశాంతమైన ప్రదేశంలో కాసేపు కూర్చోవడం వంటి చేస్తుండాలి.