Site icon HashtagU Telugu

Mint Leaves: పుదీనా వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్ల పెట్టాల్సిందే!

Mint Leaves

Mint Leaves

ఆకుకూరల్లో ఒకటైన పుదీనా వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పుదీనాను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీనాను తరచుగా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. మరి పుదీనా వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కాగా ప్రస్తుతం చాలామంది మలబద్దకం, అజీర్థి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

అయితే ఇలాంటి వారికి పుదీనా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే పుదీనాలో సహజ యాంటి స్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆ ఆకులు కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. ఈ ఆకులు కడుపులో మంటను కూడా తగ్గిస్తాయి. కాగా పుదీనా ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, ఫాస్పరస్, కాల్షియం పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడతాయట. అలాగే ఇది కణాల నష్టం నుంచి కూడా కాపాడుతాయని చెబుతున్నారు. అదేవిధంగా పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

ఇది మీ చర్మాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా మొటిమలు ఉన్నవారికి ఈ ఆకులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయట. పుదీనా ఆకులలో ఎక్కువ మొత్తంలో సాలిసిలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మొటిమలు, మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా పుదీనా ఆకులు మార్నింగ్ సిక్ నెస్ కు సంబంధించిన వికారాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయట. ఇది జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్లను సక్రియం చేసిన,వికారాన్ని కూడా తగ్గిస్తుందట. పుదీనా ఆకుల్లో రోస్మరినిక్ ఆమ్లం అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది అలెర్జీని ఉత్పత్తి చేసే సమ్మేళనాలను నిరోధిస్తుందట. అలెర్జీలు, ఉబ్బసంతో బాధపడుతున్నవారికి ఇది బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. జలుబుతో ఇబ్బంది పడేవారు పుదీనాను తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు.

Exit mobile version