Sleeping With Sweater: చలికాలంలో రాత్రిపూట నిద్రపోయేటప్పుడు చలి వేయడం వల్ల చాలామంది స్వెటర్లు, జాకెట్లు లేదా సాక్స్ ధరించి పడుకుంటారు. దీనివల్ల శరీరం వెచ్చగా అనిపించినప్పటికీ, ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవచ్చా?
ఆరోగ్య పరంగా చూస్తే.. రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవడం సరైనది కాదు. తీవ్రమైన చలి ఉన్నప్పుడు తప్ప, రోజువారీగా మందపాటి ఉన్ని బట్టలు వేసుకుని పడుకోవడం వల్ల నష్టాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్త ప్రసరణలో ఆటంకం: ఉన్ని బట్టలు శరీరానికి హత్తుకుని ఉండటం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీనివల్ల కంగారు, అసౌకర్యం కలగవచ్చు.
చర్మ సమస్యలు: ఉన్నిలోని పీచు వల్ల చర్మంపై దురద, దద్దుర్లు రావచ్చు. ముఖ్యంగా ఎగ్జిమా ఉన్నవారికి లేదా సున్నితమైన చర్మం ఉన్నవారికి చర్మం పొడిబారి ఇబ్బంది కలుగుతుంది.
శరీర ఉష్ణోగ్రత పెరగడం: ఉన్ని శరీరం లోపలి వేడిని బయటకు వెళ్లకుండా ఆపుతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి చెమట పట్టడం, నిద్ర మధ్యలో మెలకువ రావడం జరుగుతుంది. బీపీ ఉన్నవారికి దీనివల్ల కళ్ళు తిరగడం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి సంభవించవచ్చు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: మందపాటి బట్టలు ఛాతీపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఉన్నిలోని సూక్ష్మ రేణువులు శ్వాస ద్వారా ముక్కులోకి వెళ్లడం వల్ల అలర్జీలు రావచ్చు. ఆస్తమా రోగులకు ఇది మరింత ప్రమాదకరం.
Also Read: వందే భారత్ స్లీపర్ రైలు.. 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? (వీడియో)
చలికాలంలో ఎలాంటి బట్టలు ధరించి పడుకోవాలి?
రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి.
తేలికపాటి దుస్తులు: చాలా మందపాటి లేదా బరువైన బట్టలకు బదులుగా తేలికపాటి బట్టలను పొరలు పొరలుగా ధరించండి. ఉదాహరణకు పల్చని కాటన్ బట్టల పైన ఒక లైట్ థర్మల్ వేసుకోవచ్చు.
సాక్స్: చాలా మందపాటి సాక్స్‌లు ధరించడం వల్ల అసౌకర్యం కలుగుతుంది. వాటికి బదులుగా పల్చని కాటన్ సాక్స్‌లు ధరించడం మంచిది.
దుప్పటి: భారీ స్వెటర్లు లేదా జాకెట్లు వేసుకునే బదులు, మంచి నాణ్యమైన మందపాటి రగ్గు లేదా దుప్పటి కప్పుకోవడం ఉత్తమం.
