Site icon HashtagU Telugu

Pot Water Benefits : మట్టికుండలోని నీరు తాగితే ఎన్ని లాభాలో తెలిస్తే..ఫ్రిడ్జ్ వాటర్ జోలికే వెళ్లారు..!!

Pot Water Benefits

Pot Water Benefits

సమ్మర్ (Summer) వచ్చిందంటే చాలు..ప్రతి ఒక్కరు చల్లని నీరు (Cool Water) తాగేందుకే ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. వేసవి తాపాన్ని తగ్గించేందుకు చల్లని నీరు అయితనే కరెక్ట్ అని ఫ్రిడ్జ్ లోని చల్ల చల్ల వాటర్ ను తెగతాగేస్తుంటారు. కానీ ఫ్రిడ్జ్ వాటర్ (Fridge Water) తాగితే ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. అయినప్పటికీ చాలామంది వారి సలహాలు పాటించకుండా అలాగే ఫ్రిడ్జ్ వాటర్ తాగుతారు. కానీ ఫ్రిడ్జ్ వాటర్ కన్నా మట్టికుండ వాటర్ (Pot Water Benefits) తాగితే ఎంతో మంచిదని చెపుతున్నారు. ప్రస్తుతమైతే ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారు కానీ గతంలో ఎక్కువగా మట్టికుండ వాటెర్నే తాగేవారు. అంతెందుకు ఇప్పుడు కూడా పల్లెల్లో చాలామంది సమ్మర్ వస్తే మట్టికుండ తెచ్చుకొని అందులో వాటర్ నే తాగుతుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

మట్టికుండ లోని నీరు శరీరంలోని హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని, జీర్ణక్రియకు సహాయం చేరాయని , రోగనిరోధక శక్తిని సైతం పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. అలాగే మట్టికుండలు సహజంగా శీతలీకరణ లక్షణాలు కలిగి ఉండడం వల్ల నీటిని చల్లగా, ఫ్రెష్​గా ఉంచడంలో సహాయం చేస్తాయని అంటున్నారు. మట్టి కుండలోని నీరు తాగడం వల్ల నీటి రుచి, వాసన పెరుగుతుందని, మట్టి కుండలలో ఉపయోగించే మట్టి పదార్థం నీటికి ప్రత్యేక మట్టి రుచిని అందిస్తుంది. ఇది తాగడానికి టేస్టీగా, రిఫ్రెష్​గా ఉంటుందని చెపుతున్నారు. మట్టి కుండలలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల నీటిని శుద్ధి చేసి సురక్షితమైన నీటిని అందిస్తాయి. నీటిలోని మలినాలు, విషాన్ని గ్రహించే సామర్థ్యం మట్టికి ఉంటుంది. ఇవి తాగడానికి చాలా మంచివి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి అని చెపుతున్నారు. ఇప్పటికైనా మట్టికుండ వాటర్ ను తాగాలని సూచిస్తున్నారు.

Read Also : Siddharth : పాపం సిద్ధార్థ్.. అసూయకి బాధకు మధ్య స్థితి..!