Postpartum Depression: మహిళల్లో ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలు

మాతృత్వం అనేది మహిళకు ఒక వరం. పిల్లల కోసం ఆమె పడే తాపత్రయం మాటల్లో చెప్పలేనిది. అందుకే గర్భం దాల్చినప్పుడు మహిళలు పడే సంతోషం అంతా ఇంతా కాదు.

Postpartum Depression: మాతృత్వం అనేది మహిళకు ఒక వరం. పిల్లల కోసం ఆమె పడే తాపత్రయం మాటల్లో చెప్పలేనిది. అందుకే గర్భం దాల్చినప్పుడు మహిళలు పడే సంతోషం అంతా ఇంతా కాదు. అయితే బిడ్డను ప్రసవించాక కూడా ఆమె అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒత్తిడి సమస్యలో కొందరు మహిళలు ఇరుక్కుంటున్నారు. మహిళల్లో ప్రసవానంతర మానసిక, శారీరక ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ వహించాలని వైద్యులు చెప్తుంటారు.

ప్రసవానంతర డిప్రెషన్ (Post Partum Depression) ప్రసవం తర్వాత స్త్రీలను ప్రభావితం చేసే తీవ్రమైన అనారోగ్యం. ఈ సమస్యను ఎదుర్కొంటున్న మహిళలు నిర్లక్ష్యం వహించకుండా సమయానికి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కానీ పక్షంలో ఈ సమస్య వారాలు, నెలలు లేదా సంవత్సరాలు కూడా ఉంటుంది.

ఈ సమస్య ప్రసవానంరం మహిళల్లో కనిపిస్తుంది. ఒంటరి మహిళలు, కుటుంబ సపోర్ట్ లేని వాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ సమస్య అందరిలోనూ కనిపించదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కునే వాళ్ళు 10 నుంచి 26 శాతం మాత్రమే. ఈ సమస్య ఎదుర్కునే వాళ్లలో విచారం, నిస్సహాయంగా అనిపిస్తుంది. శిశువుకు సంబంధించిన కార్యకలాపాలు అంటే ఆహారం ఇవ్వడం లేదా ఆడుకోవడం వంటి వాటిపై ఆసక్తి లేకపోవడం దీని లక్షణాలు. అలాగే ఎంత నిద్ర పోయినప్పటికీ శారీరకంగా అలసిపోయినట్లు అనిపించడం కూడా ప్రసవానంతర డిప్రెషన్ యొక్క లక్షణం కావచ్చు. ఆహారపు అలవాట్లలో ముఖ్యమైన మార్పులు, ఆకలి లేకపోవటం లేదా ఆకస్మికంగా అతిగా తినడం వంటివి ప్రసవానంతర డిప్రెషన్(PPD) యొక్క లక్షణాలు కావచ్చు.కారణం లేకుండా ఉద్రేకం, చిరాకు లేదా కోపం రావడం కూడా ప్రసవానంతర డిప్రెషన్ లో ఒక లక్షణమే. శిశువు శ్రేయస్సు, జీవితంలోని ఇతర అంశాల గురించి నిరంతరం ఆందోళన చెందడం లేదా భయపడటం కూడా ఈ సమస్యలో భాగమే.

గర్భంతో ఉన్న సమయంలో గర్భిణీలు కంటి నిండా నిద్ర పోవడంతోపాటు సమతుల ఆహారం తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. ఇక గర్భంతో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల ధైర్యం వారికీ అవసరం. నిత్యం వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఏ చిన్న సమస్య అనిపించినా అడిగి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

Read More: Chicken or Egg: కోడి ముందా.. గుడ్డు ముందా.. మొత్తానికి తేల్చేసిన సైంటిస్టులు?