Post Workout Tips : వ్యాయామం చేసిన తర్వాత ఈ నియమాలు తప్పనిసరి.. అవేంటో తెలుసుకోండి

వ్యాయామం తర్వాత మీ శరీరాన్ని సాగదీయడం కూడా చాలా మంచిది. 30 సెకన్లపాటు శరీరాన్ని సాగదీస్తే.. మీ కండరాలు కోలుకునేందుకు ఉపయోగపడుతుంది. వర్కవుట్స్ సమయంలో..

Published By: HashtagU Telugu Desk
post workout tips

post workout tips

Post Workout Tips : బరువు తగ్గాలంటే వ్యాయామం చేయాలి. కరెక్టే.. కానీ వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గడం లేదంటే.. వ్యాయామం తర్వాత మీరు కొన్ని నియమాలను పాటించడం లేదని అర్థం. ఒంటినిండా చెమట పట్టేలా వ్యాయామం చేస్తే సరిపోదు. జిమ్, వాకింగ్, యోగా ఎంత చేసినా ఫలితం ఉండదు. కొన్ని పోస్ట్ వర్కౌట్ టిప్స్ ను కూడా పాటించాలి.

చెమటపట్టేలా వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో.. వ్యాయామం తర్వాత శరీరాన్ని కూల్ డౌన్ చేయడం అంతే ముఖ్యం. వ్యాయామం చేసేటపుడు శరీర ఉష్ణోగ్రత, హార్ట్ బీట్ పెరుగుతాయి. వర్కౌట్స్ పూర్తయ్యాక కాసేపు కూర్చుంటే.. శరీరం మునుపటి ఉష్ణోగ్రత, సాధారణ హార్ట్ బీట్ కు వస్తుంది. లేదంటే.. మైకం కమ్మడం, రక్తం గడ్డకట్టం, మూర్చ వంటివి వచ్చే అవకాశాలున్నాయి.

వ్యాయామం తర్వాత మీ శరీరాన్ని సాగదీయడం కూడా చాలా మంచిది. 30 సెకన్లపాటు శరీరాన్ని సాగదీస్తే.. మీ కండరాలు కోలుకునేందుకు ఉపయోగపడుతుంది. వర్కవుట్స్ సమయంలో చెమటలు పట్టడం వల్ల శరీరంలో నీరు బయటికి వస్తుంది. అందుకే వర్కవుట్స్ పూర్తయ్యాక నీరు ఎక్కువగా తాగాలి. ఇది బరువు తగ్గడంతో పాటు కండరాలను సరిచేసేందుకు, కోలుకునేందుకు సాయం చేస్తుంది.

వ్యాయామం తర్వాత ఆకలిగా ఉండటం సహజం. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, కూరగాయలు తినాలి. ప్రొటీన్ షేక్ తీసుకోవచ్చు. లేదా యాపిల్, కొన్ని బాదంపప్పులను కూడా తినొచ్చు. ఆకలేస్తుంది కదా అని బర్గర్, చిప్స్ తినకూడదు. ఇవి కండరాలు, కీళ్లపై ప్రభావం చూపుతాయి. వర్కవుట్స్ తర్వాత శరీరానికి కాస్త విశ్రాంతి ఇవ్వాలి. లేదంటే అసౌకర్యంగా ఉంటుంది. ఆ తర్వాత స్నానం చేయడం మంచిది.

  Last Updated: 18 Jan 2024, 09:03 PM IST