Site icon HashtagU Telugu

Poppy Seeds: బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే వీటిని తీసుకోవాల్సిందే?

Poppy Seeds

Poppy Seeds

చాలామంది బరువు తగ్గడానికి నానా తిప్పలు పడితే మరి కొంతమంది బరువు పెరగడానికి ఎన్నెన్నో చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. బక్క పల్చగా ఉన్నవారు బరువు పెరగడానికి రకరకాల ఆహార పదార్థాలు, డైట్ లు ఫాలో అవుతూ ఉంటారు. ఎక్కువ బరువు ఉన్నవారు తొందరగా బరువు తగ్గడం ఎంత సమస్యో, అదేవిధంగా బక్క పల్చగా ఉన్నవారు తొందరగా బరువు పెరగాలని కోవడం కూడా అంతే సమస్య అవుతుంది. కొందరు తొందరగా బరువు పెరగాలని ఏవేవో తింటూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా బరువు పెరగాలి అనుకుంటే అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం..

గసగసాలలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కేవలం 100 గ్రాములలో దాదాపు 525 కేలరీలు లభిస్తాయి. బరువు పెరగాలని అనుకునే వారికి నిపుణులు సూచించే అద్భుతమైన హోమ్ రెమిడీ ఇది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. జింక్ థైరాయిడ్ గ్రంధుల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్లకు మంచి మూలం. కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. రోజూ పాలతో కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. మలబద్ధకం, గ్యాస్ సమస్యల్ని తొలగిస్తుంది. అలాగే ఇది మహిళల్లో సంతానోత్పత్తి అవకాశాలు పెంచుతుంది. కడుపు సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫైబర్ పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. రోజూ గసగసాలు తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.

అదేవిధంగా పోషకాలు నిండి ఈ గసగసాలను అతిగా తీసుకోవడం వల్ల అనేక అనార్థాలు ఉన్నాయి. అలర్జీ, మలబద్ధకం, వికారం అలసట వంటి ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది. గసగసాల గింజలు కొన్ని నీటిలో కనీసం 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని రాత్రి పాలలో వేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒకసారి కాచి పక్కన పెట్టుకున్న తర్వాత పడుకునే ముందు వీటిని తాగితే మంచిది. ఈ పాలు తాగిన మూడు నుంచి నాలుగు వారాల లోపే బరువు పెరగడంలో మార్పులు చూడవచ్చు. ఒకవేళ పేస్ట్ గా చేసుకోకపోవడం ఇష్టం లేకపోతే గసగసాలు పొడి చేసి పెట్టుకోవచ్చు. వాటిని మిక్సీలో వేసుకుని పొడి చేసుకుని గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేసుకోవచ్చు. కాస్త ఘాటు రుచి కలిగి ఉంటుంది. పాల రుచి మరింత పెంచుకునేందుకు దీనికి కొద్దిగా సోంపు పొడి కూడా జోడించుకోవచ్చు. దాన్ని మిక్స్ చేసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా నయం అవుతాయి.