Site icon HashtagU Telugu

Pollution: కళ్ళను పొల్యూషన్ నుంచి ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసా?

Polution

Polution

దేశవ్యాప్తంగా రోజురోజుకీ వాహనాల సంఖ్య పెరిగిపోతుండడంతో కాలుష్యం కూడా అంతకంతకు పెరిగిపోతోంది. మరి ముఖ్యంగా పెద్దపెద్ద నగరాలలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి ఏడాది కొన్ని వందల మంది ఈ కాలుష్యం బారిన పడి మరణిస్తున్నారు. కాలుష్యం వల్ల పిల్లలు వృద్దులు గర్భిణీలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కాలుష్యం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి అన్న విషయం తెలిసిందే.

ఈ కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు కళ్ళు శ్వాసకోస సమస్యలు ఇలా ఎన్నో రకాల ప్రమాదాల బారిన పడవచ్చు.ఈ కాలుష్యం వల్ల ప్రజల కళ్లు కూడా దెబ్బతింటున్నాయి. కాలుష్యం వల్ల కంటి సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువే ఉంటుంది. కాలుష్యం కారణంగా కళ్లు పొడిబారడం, ఎలర్జీ లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కళ్లకు తేమ, పోషణ కోసం తగినంత మొత్తంలో కన్నీళ్లు ఉత్పత్తి కాకపోతే డ్రై ఐ సిండ్రోమ్ సంభవిస్తుంది. వాయు కాలుష్యం కళ్లలోని కణాలను ప్రభావితం చేస్తుంది.

దీని వల్ల కళ్లు పొడిబారడం, ఎరుపెక్కడం, నొప్పి, సున్నితత్వం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కలుషితమైన గాలిలో నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి మూలకాలు అధికంగా ఉండటం వల్ల కళ్లకు ఎక్కువ నష్టం జరుగుతుంది.కళ్ళను చల్లటి నీటితో కడగండి. మీకు కళ్లలో మంటగా అనిపించినప్పుడల్లా ముందుగా చల్లటి నీటితో కడగడం మంచిది. ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది. రోజ్ వాటర్‌ని ఉపయోగించి కంటి చికాకు,పొడి కళ్ల సమస్యని తొలగించవచ్చు.ఇందుకోసం ప్రతిరోజూ కాటన్‌ తీసుకొని రోజ్‌వాటర్‌లో ముంచి కళ్లపై అప్లై చేయాలి.

Exit mobile version