8 నెలల్లో 46 కిలోలు తగ్గిన పోలీస్..

సాధారణంగా మనం ఒకసారి బరువు పెరిగితే దానిని తగ్గించుకోవడం అంత సాధ్యం కాదు. చాలా మంది తమ బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - December 28, 2022 / 10:25 PM IST

సాధారణంగా మనం ఒకసారి బరువు పెరిగితే దానిని తగ్గించుకోవడం అంత సాధ్యం కాదు. చాలా మంది తమ బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో కొందరు సక్సెస్ అయితే ఇంకొందరు మాత్రం బరువు ఇంకా ఇంకా పెరుగుతారు. అయితే ఇక్కడొక పోలీస్ మాత్రం తాను బరువు తగ్గాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే భారీగా బరువు తగ్గి స్లిమ్ గా తయారయ్యాడు. కేవలం 8 నెలల్లోనే 46 కేజీల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఢిల్లీలో డీసీపీగా పనిచేస్తున్న జితేందర్ మణి కేవలం 8 నెలల్లోనే 46 కిలోల బరువు తగ్గి స్లిమ్ గా మారిపోయారు. తాను స్లిమ్ గా తయారవ్వడానికి ఆయనేమీ ఔషధాలు వాడలేదు. కేవలం కఠినమైన నియమాలను మాత్రమే పాటించాడు. అలాగే ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేశాడు.

గతంలో జితేందర్ మణి 136 కిలోల బరువు ఉండేవాడు. ఆ టైంలో అనేక అనారోగ్య సమస్యలు ఆయన్ని చుట్టుముట్టేవి. వాటి వల్ల ఆయన ఉద్యోగం కూడా సవ్యంగా చేసేవాడు కాదు. డయాబెటిస్, అధిక రక్తపోటు, కొవ్వులు పెరిగిపోవడం వంటివి ఎక్కువై ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆయన తన బరువును ఎలాగైనా తగ్గించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక ప్రణాళిక వేసుకున్నారు. రోజూ 15 స్టెప్పులు వాకింగ్ చేయడంతో పాటు కొవ్వులుండే ఆహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

అన్నం, పండ్లు, కూరగాయలు, సూప్ లు వంటివి తీసుకోవడం మొదలు పెట్టారు. క్రమం తప్పకుండా వాకింగ్ చేశారు. అంతేకాకుండా తప్పనిసరిగా డైట్ పాటించారు. అలా చేయడం వల్ల కేవలం 8 నెలల్లోనే 12 ఇంచుల నడుము పరిణామం తగ్గింది. ఇప్పుడు ఆయన 84 కిలోలకు తగ్గారు. దీంతో ఉన్నతాధికారులు ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చి ప్రశంసలు కురిపించారు.