Site icon HashtagU Telugu

Health Tips: ఇవి తింటే చాలు.. ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరగడం ఖాయం!

Health Tips

Health Tips

ఆరోగ్యంగా ఉండడంతో పాటు అందంగా కూడా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలా మంచి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు అందం ఆరోగ్యం రెండు మెరుగవుతాయని చెబుతున్నారు. అందంని ఆరోగ్యాన్ని పెంచే ఆ ఫుడ్స్ ఏంటో ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అవకాడో.. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయట. ముడతలను తొలగిస్తాయట. నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు మీరు మీ ఆహారంలో పుచ్చకాయ, గుమ్మడికాయ, దోసకాయ, టొమాటో, పాలకూర, స్ట్రాబెర్రీ వంటి నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకుంటే అవి చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయట. చర్మం కూడా అందంగా కనిపిస్తుందట. మొటిమలు, మచ్చల సమస్యల నుండి విముక్తి పొందుతారని చెబుతున్నారు.

ఆకు కూరలు మీ ఆహారంలో బచ్చలి కూర, వివిధ రకాల ఆకు కూరలు చేర్చుకుంటే వాటిలో ఉండే పోషకాలు చర్మంతో పాటు జుట్టును ఆరోగ్యంగా,అందంగా ఉంచడంలో సహాయపడతాయట. చిలగడ దుంపలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇది చర్మపు మంటను తొలగిస్తుంది. అతినీలలోహిత కిరణాల ప్రభావాల నుండి రక్షిస్తుందట. అంతే కాదు, వృద్ధాప్య లక్షణాలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. నట్స్,సీడ్స్ జీడిపప్పు, బాదం వంటి వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ బయోటిన్, ప్రొటీన్, విటమిన్ ఈ తో నిండి ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ల ప్రభావాల నుండి చర్మాన్ని రక్షిస్తుందట.

ఇది వృద్ధాప్య ప్రభావాలను తగ్గించడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే వయసు పెరిగేకొద్ది చర్మం పైన ముడతలు రావడం సహజం. అయితే రోజూ శరీరానికి కావలసినంత నీరు తాగుతూ ఉంటే ఈ ముడతలు రావట. నీరు బాగా తాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా, బిగుతుగా ఉంటే ముడతలు రావు. నీరు బాగా తాగుతూ ఉంటే రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే శరీరంలో కొత్త కణాల ఏర్పాటుకు దారి తీస్తుంది. ఇది చర్మాన్ని మెరుగు పరుస్తుందని చెబుతున్నారు.