క్యాన్సర్ (Cancer) బాధితుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అధికం అవుతోంది. దీనికి కారణం ప్రధాన కారణం క్యాన్సర్ పై అవగాహన లేకపోవడం.. క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తించక పోవడం వంటివి కారణాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎం.ఇ.ఐ.ఎల్ ఫౌండేషన్ , సుధా రెడ్డి ఫౌండేషన్ (Sudha Reddy, MEIL Foundation) సంయుక్తంగా ‘పింక్ పవర్ రన్ 2024’ (Pink Power Run 2024) కార్యక్రమాన్ని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని సీఎం తెలిపారు. వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీఠవేస్తోందని అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి పౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సుధారెడ్డికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పింక్ పవర్ 5కె, 10కె రన్‌లో గెలుపొందిన వారికి సీఎం రేవంత్ రెడ్డి నగదు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సుమారు 5 వేల మందికి పైగా ఈ పింక్ పవర్ రన్‌లో పాల్గొన్నారు. స్టూడెంట్స్, డాక్టర్స్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో సహా అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు పాల్గొన్నారు. మూడు కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పింక్ పవర్ రన్‌ను నిర్వహించడం జరిగింది. ఈ మారథాన్ లు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమై .. దూరానికి అనుగుణంగా ఓల్డ్ ముంబయి జాతీయ రహదారి, ఐఎస్‌బీ రోడ్, టి ఎన్ ఓ కాలనీ మీదుగా కొనసాగి తిరిగి గచ్చిబౌలి స్టేడియంలో ముగిసింది.
Thousands joined the Pink Power Run 2024 to raise awareness about breast cancer. A huge thank you to all runners, volunteers, and supporters! Together with #MEILFoundation and #SudhaReddyFoundation, we step closer to a healthier future! 🏃♀️💪#PinkPowerRun #BreastCancerAwareness… pic.twitter.com/6Hk79cMjpw
— TopTeluguNews (@TheSPRWorld) September 29, 2024
Read Also : SpaceX Rescue Mission: సునీతా విలియమ్స్ మరియు టీం కోసం రెస్క్యూ మిషన్ ప్రారంభం