Site icon HashtagU Telugu

Pine Apple Green Tea: వామ్మో.. పైనాపిల్ గ్రీన్ టీ తో అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయా!

Pine Apple Green Tea

Pine Apple Green Tea

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పై పూర్తి అవగాహన శ్రద్ధా పెరిగిపోవడంతో చాలా జాగ్రత్తగా ఉండు మంచి మంచి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు. ఈ క్రమంలో టీ కాఫీలకు బదులు ఉదయం లేవగానే గ్రీన్ టీ తాగటానికి ఆసక్తి చూపుతున్నారు. గ్రీన్ టీ తాగటం వల్ల శరీర బరువు తగ్గటమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అయితే గ్రీన్ టీ కంటే పైనాపిల్ గ్రీన్ టీ వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి పైనాపిల్ గ్రీన్ టీ వల్ల ఇలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే ముందుగా ఈ టీ తయారు చేసుకోవడానికి అరకప్పు పైనాపిల్ ముక్కలు తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసు నీరు పోసి బాగా మరిగించి ఆ తర్వాత ఆ పైనాపిల్ ముక్కలు అల్లం అంగుళం దాల్చిన చెక్క పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసి దాదాపుగా 10 నుంచి 12 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత టీ వడపోసి ఒక స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ పైనాపిల్ గ్రీన్ టీ చాలా బాగా పనిచేస్తుందట. టీ తాగుతూ వ్యాయామాలు చేయడం వల్ల ఈజీగా తొందరగా బరువు తగ్గుతారు అని చెబుతున్నారు.

అంతేకాదు ఈ పైనాపిల్ గ్రీన్ టీ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు కూడా దూరం అవుతాయట. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుందని, క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గటమే కాకుండా జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుందని చెబుతున్నారు. అలాగే గ్యాస్ ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయట. ప్రతిరోజు ఉదయం లేవగానే పైనాపిల్ గ్రీన్ టీ తాగటం అలవాటు చేసుకోవాలట. అయితే మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టయితే ఈ టీ తాగడానికి ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు.