Rash On Face: మొహంపై మచ్చలన్నీ మొటిమలు కావు.. ఈ చర్మవ్యాధులూ అయి ఉండొచ్చు!!

ఎర్రటి బొబ్బలు, నల్లటి మచ్చలు,పులిపిరులు, పసుపు రంగు బొబ్బలు వీటన్నిటిని ఒకే గాటన కట్టి చూస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలు వేస్తున్నట్టే!!

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 07:45 AM IST

మీ ముఖంపై ఏర్పడే ప్రతి మచ్చ కూడా మొటిమే అనుకుంటున్నారా?

ఎర్రటి బొబ్బలు, నల్లటి మచ్చలు,పులిపిరులు, పసుపు రంగు బొబ్బలు వీటన్నిటిని ఒకే గాటన కట్టి చూస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలు వేస్తున్నట్టే!!

అవి ఇతరత్రా చర్మ వ్యాధులకు సంబంధించిన సంకేతాలు కూడా అయి ఉండొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖం పై మొటిమలు కాకుండా ఏయే వ్యాధుల సంకేతంగా నిలిచే మచ్చలు ఏర్పడతాయి? అనేది వైద్య నిపుణులు వివరించారు. అవి ఇప్పుడు చూద్దాం..

* రొజేషియా..

మీరు ఇప్పుడే బాగా స్పైసీ గా ఉండే లంచ్ చేశారనుకుందాం. కాసేపటికి మీ స్కిన్ వెచ్చగా అనిపిస్తుంది. కొద్దిగా ఎర్రగా మారుతుంది. బుగ్గల మీద చిన్న చిన్న ఎర్ర పొక్కులలా వస్తాయి. చూడడానికి సన్ బర్న్‌లా అనిపిస్తుంది. మీరు యాక్నే అనుకుంటారు కానీ, కాదు, అది రొజేషియా.యాక్నే కీ రొజేషియాకీ ఉన్న తేడా ఏమిటి, ఎలా గుర్తించాలి అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే, యాక్నే కి చేసే ట్రీట్మెంట్ రొజేషియా ఉన్న వారికి బాగా ఇరిటేటింగ్ గా ఉంటుంది. రొజేషియా అన్నది ఒక క్రానిక్ కండిషన్. ఈ కండిషన్ లో స్కిన్ ఎర్రగా తయారవడం, రఫ్ గా, పొక్కులు వచ్చినట్లుగా తయారవుతుంది. బ్రేకౌట్ చుట్టూతా ఇన్‌ఫ్లమేషన్ ఉండవచ్చు. పొక్కుల్లో చీము కూడా ఉండవచ్చు. రొజేషియా వల్ల బుగ్గంతా, లేదా నుదురంతా ఎర్రగా తయారవుతుంది. రొజేషియా మామూలుగా 30 సంవత్సరాలు దాటిన వారిని ఎఫెక్ట్ చేస్తుంది.

* యాక్నే..

యాక్నే మాత్రం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, గట్టి పొక్కుల్లా వస్తుంది. యాక్నే వల్ల కూడా ఎర్రదనం ఉంటుంది కానీ ఆ ఎర్రదనం మొటిమ చుట్టూతా మాత్రమే ఉంటుంది. యాక్నే, రొజేషియా రెండూ మీ ఫేస్ మీద వచ్చినా కూడా యాక్నే చాతీ, వీపు, భుజాలు, పిరుదుల మీద కూడా రావచ్చు. యాక్నే ఎక్కువగా టీనేజ్ లో ఉన్న వారిని ఎఫెక్ట్ చేస్తుంది, పెద్ద వారికి కూడా ఈ సమస్య ఉంటుంది కానీ తక్కువనే చెప్పుకోవచ్చు. ప్యూబర్టీ, ప్రెగ్నెన్సీ వంటి సమయాల్లో యాక్నే చాలా కామన్ గా ఉంటుంది.

*మిలియా..

మిలియా చర్మ సంబంధిత సమస్య. చర్మం మీద కళ్ళు, ముక్కు మరియు బుగ్గల క్రింద భాగంలో చిన్నపాటి తెల్లని గడ్డల రూపంలో అభివృద్ధి చెందే రకానికి చెందిన ఒక సాధారణ చర్మ సమస్య. అనేకమంది ఇది కేవలం పిల్లలలోనే కనిపిస్తుంటుంది అని అపోహ పడుతుంటారు. కానీ ఇది అబద్దం, ఈ చర్మ సమస్యకు వయసు భేదం, లింగ బేధం లేదు. ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం కాలుష్యం, చర్మం నందు మృతకణాల, మలినాల పెరుగుదల.ఈ తెల్లటి గడ్డలను, మిలియం సిస్ట్స్(తిత్తి)గా వ్యవహరిస్తారు. ఇవి దురద లేదా నొప్పిని కలిగించకపోయినా అసౌకర్యానికి మూలంగా ఉంటుంది. వీటిని మేకప్ తో దాచడం కూడా కష్టమే.

* డెర్మటైటిస్..

చర్మవాపునే డెర్మటైటిస్ అని పిలుస్తారు.చర్మవాపు అనేది చర్మం యొక్క వాపు, ఇది కొన్ని సమస్యల సమూహముల వలన సంభవిస్తుంది. ఇది ఎక్కువగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. దీని
సాధారణ లక్షణాల్లో.. ఎర్రదనం,
నొప్పి,బొబ్బలు ఏర్పడడం,తీవ్రమైన దురద,వాపు వంటివి ఉన్నాయి.

* ఫాలిక్యులైటిస్

స్టాఫ్ బ్యాక్టీరియా ఒక హెయిర్ ఫాలికిల్ ని ఇంఫెక్ట్ చేయడం వల్ల ఫాలిక్యులైటిస్ వస్తుంది. స్టాఫ్ బ్యాక్టీరియా స్కిన్ మీదే ఉంటుంది కానీ జనరల్ గా ఎలాంటి హానీ కలుగచేయదు. కానీ, ఏదైనా గాయం ద్వారా అది స్కిన్ లోపలికి వెళ్ళగలిగితే మాత్రం ఇన్‌ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇన్‌ఫెక్షన్ ముదిరితే అది పుండులాగా తయారౌతుంది, బాగా నొప్పిగా కూడా ఉంటుంది. ఈ ఫాలిక్యులైటిస్ బంప్స్ చూడడానికి రెగ్యులర్ యాక్నే లాగానే ఉంటాయి. చర్మం మీద ఎర్రగా ఉండి, చీముతో నిండి ఉండి, దురద పెడుతూ అసౌకర్యాన్ని కలుగచేస్తాయి. చాలా సందర్భాల్లో కొంచెం కేర్ తీసుకుంటే ఈ బంప్స్ వాటంతట అవే పోతాయి.గడ్డం మొటిమలు బ్యాక్టీరియా లేదా ఇన్ గ్రోన్ హెయిర్ వల్ల వస్తాయి. ఈ సమస్యను ఫోలిక్యులిటిస్ అని కూడా పిలుస్తారు. ఇది తీవ్రమైన దురదను కలిగిస్తుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. గడ్డం మొటిమలను మీ చర్మం నుంచి దూరంగా ఉంచడానికి కొన్ని సులభమైన పద్ధతులను అనుసరించాలి.

* మొలస్కం కాంటాజియోసమ్

మొలస్కం కాంటా జియోసమ్ ను  నీటి మొటిమలు అని పిలుస్తారు . ఇది చర్మం యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ . దీని ఫలితంగా మధ్యలో పల్లంతో చిన్న గులాబీ రంగు గాయాలు ఏర్పడతాయి.  దురద లేదా పుండ్లు కూడా పడవచ్చు. పొత్తికడుపు , కాళ్లు, చేతులు, మెడ, జననేంద్రియ ప్రాంతంపై దీని ఎఫెక్ట్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి సోకిన ఏడు వారాల తర్వాత మచ్చలు బయటపడతాయి.

* కెరటోసిస్ పిలారిస్

కెరటోసిస్ పిలారిస్ అనేది చర్మంపై కఠినమైన పాచెస్, చిన్న, మొటిమల వంటి గడ్డలను కలిగించే ఒక పరిస్థితి. శరీరంలోని నిర్దిష్ట ప్రాంతాలను దాచిపెట్టడం, చర్మం కఠినత్వాన్ని తగ్గించడానికి కఠినమైన చర్మ దినచర్యలలో పాల్గొనడం అనేది కెరటోసిస్ పిలారిస్‌ తో బాధపడే చాలా మంది వ్యక్తులకు రోజువారీ సంఘటన. దీనివల్ల చేతులు, పిరుదులు, ముఖంపై అనేక చిన్న, కఠినమైన, ఎరుపు లేదా గులాబీ రంగు మచ్చలు వస్తాయి.

* చికెన్‌పాక్స్‌

చికెన్‌పాక్స్‌ అనేది వరిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వచ్చే సాధారణ వ్యాధి. ఇది ఏ వయసులోనైనా వస్తుంది. అయితే ఎక్కువగా ఈ వ్యాధి పిల్లలు, యువకులలో కనిపిస్తుంది. దీని కారణంగా, శరీరంపై చిన్న ఎరుపు రంగు దద్దుర్లు మొదలవుతాయి. కొన్నిసార్లు చీము కూడా ఏర్పడుతుంది. వేసవిలో లేదా వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఇది సోకినప్పుడు అధిక జ్వరం వస్తుంది.

* మంకీ పాక్స్‌

మంకీపాక్స్ ఒక వైరల్‌ డిసీజ్‌. మంకీపాక్స్‌‌ స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే. ఇది జూనోటిక్‌ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం కూడా ఉంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.వ్యాధి సోకిన జంతువు గాయాన్ని తాకినా, సంపర్కరం, కాటు కారణంగా సోకే అవకాశం ఉంది. ప్రస్తుతం నమోదయ్యే, కేసులు ఎక్కువ మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నవే. లైంగిక సంపర్కం ద్వారా మంకీపాక్స్‌ వ్యాపించే అవకాశం ఉంది.