Site icon HashtagU Telugu

Health Problems: ఆ సమస్యలు ఉన్నవారు పచ్చిబఠానీ తింటే అంతే సంగతులు?

Mixcollage 13 Dec 2023 02 03 Pm 1697

Mixcollage 13 Dec 2023 02 03 Pm 1697

మామూలుగా పచ్చి బఠానీ అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ బఠానీల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనం అందరికీ తెలిసిందే. పచ్చి బఠానీలలో ఎన్నో రకాల విటమిన్లు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు ఈ పచ్చి బఠానీలు తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు బఠానీలు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆసిడిటీ, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు పచ్చి బఠానీలు తక్కువగా తీసుకోవాలి.

ఈ పచ్చి బఠానీలు చేసిన కూరలు రాత్రి సమయంలో తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. పచ్చి బఠానీలలో ప్రోటీన్, పిండి పదార్థాలు అధికంగా మొత్తంలో ఉంటాయి. కావున బఠానీలను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుచి బాగున్నాయి కదా అని వీటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. కిడ్నీ మన శరీరంలో ముఖ్యమైన అవయవం. శరీరం నుండి వ్యర్థ విష పదార్థాలను బయటికి పంపించడమే దీని పని అయితే పచ్చి బఠానీ లాంటి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు ఎక్కువ సమస్య ప్రమాదం ఉంటుంది.

యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో ఉండే ఒక రకమైన ద్రవం. శరీరం దీని లెవెల్స్ అధికమైనప్పుడు కీళ్లనొప్పులు మొదలవుతూ ఉంటాయి. పచ్చిబఠానీలలో యూరిక్ యాసిడ్ని పెంచే అమీనో ఆసిడ్స్, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దాని వలన కీళ్లనొప్పులు ఉన్నవారు పచ్చిబఠానీలు తక్కువగా తీసుకోవాలి. కాబట్టి పైన చెప్పిన సమస్యలతో బాధపడుతున్న వారు బఠానీలు తీసుకున్న కూడా తక్కువ తీసుకోవడం మంచిది.. అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలతో లేనివారు ఈ బఠానీ లను ఎక్కువగా తీసుకున్న కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.