Site icon HashtagU Telugu

Foods: షుగర్ ఉన్నవారు పొరపాటున కూడా తినకూడని ఫుడ్స్ ఇవే.. తింటే హాస్పిటల్ పాలవ్వాల్సిందే!

Diabetes

Diabetes

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని వయసుతో తేడా లేకుండా చాలామంది ఈ షుగర్ వ్యాధికి గురవుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పదేళ్ల లోపు పిల్లల నుంచి ఈ సమస్య మొదలవుతుండడం ఆశ్చర్య పోవాల్సిన విషయం. ఈ షుగర్ ఒకసారి వచ్చింది అంటే చాలు చచ్చే వరకు పోదు. కానీ షుగర్ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల మందులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఉపయోగించి రక్తంలో షుగర్ లెవల్స్ ని అదుపులో ఉంచుకోవచ్చు.

ఆ సంగతి పక్కన పెడితే డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకునే ముందు జాగ్రత్త పాటించాలని, కొన్ని రకాల ఫుడ్స్ ని తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. చక్కెరతో తయారైన ఫుడ్స్ తగ్గించడం వల్ల మీ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగవు. కేక్స్, కుకీస్, వైట్ బ్రెడ్స్ వంటి బేకరీ ఫుడ్స్ అస్సలు తినకూడదట. దీని వల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. అంతేకాకుండా బరువు పెరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కాబట్టి, వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిదట. వీటి బదులు హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఎక్కువగా ఫ్యాట్ ఉండే మీట్, మిల్క్ ప్రొడక్ట్స్, పౌల్ట్రీ వంటివి మీ ఆరోగ్యానికి అంత మంచివి కావట. వీటిని తీసుకోకపోవమే మంచిది. డయాబెటిస్ కంట్రోల్ అయ్యేందుకు ఇవి ఏ మాత్రం హెల్ప్ చేయవు. పైగా సమస్యని మరింతగా పెంచుతాయట.

ముఖ్యంగా సోడా, రుచిగా ఉండే కాఫీ, డ్రింక్స్, ఫ్రూట్ పంచ్, నిమ్మరసం చక్కెరతో కలిపి తీసుకోవడం వంటివి కూడా అస్సలు మంచివి కావట. ఇవి టేస్టీగా ఉన్నప్పటికీ మీ గ్లూకోజ్ లెవల్స్, కొవ్వుని పెంచుతాయట. దీని వల్ల ఫ్యాటీ లివర్ సమస్య కూడా వస్తుందని చెబుతున్నారు. మీకు షుగర్ సమస్య ఉంటే ఆల్కహాల్ తగ్గించాలి. ఎందుకంటే ఇది మీ లివర్ గ్లూకోజన్‌ విడుదల చేసే సామర్థ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుందట. కొన్ని డ్రింక్స్ ఎక్కువగా పంచదారని కలిగి ఉంటాయి. కాబట్టి, వాటిని తీసుకోకపోవడమే మంచిదట. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ పెరగడమే కాదు. బరువు కూడా పెరుగుతారట. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. బయట కొనే ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవద్దు. ఇందులో అన్ హెల్దీ ఫ్యాట్స్, ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఎక్కువగా ఫ్రక్టోజ్‌ లు కూడా ఎక్కువా ఉంటాయి. వీటిని తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఈ ఫుడ్స్‌ ని తీసుకోకపోవడమే మంచిది. షుగర్ కంట్రోల్ అయ్యేందుకు ఎక్సర్‌సైజ్ చేస్తూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. సమస్య ఉందని తెలియగానే డాక్టర్ సలహాతో డైట్ చేంజ్ చేయాలి. దీంతో పాటు హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. అప్పుడే షుగర్ కంట్రోల్ అవుతుందట..