డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన కిస్‌మిస్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కిస్‌మిస్ ను డైట్ లో భాగం చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఎండు ద్రాక్షను చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. ఈ ఎండు ద్రాక్షను తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వీటిని ఎన్నో రకాల స్వీట్ల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు వీటిని నేరుగా తింటే మరికొందరు స్వీట్ల రూపంలో ఇంకొందరు నానబెట్టి కూడా తింటూ ఉంటారు. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కిస్‌మిస్ తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు కిస్‌మిస్ తినకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కిస్‌మిస్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినకూడదట. కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినకూడదని, వీటిని తీసుకుంటే అతిసారం వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. అంతేకాకుండా విరేచనాలు, కడుపు నొప్పి సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉందట. అందుకే జీర్ణ సమస్యలతో బాధపడేవారు ఎండు ద్రాక్షను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
ఇలాంటి వారు బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఎండు ద్రాక్ష తినకపోవడమే మంచిదట. ఎందుకంటే వీటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. కిస్‌మిస్‌ను ఎక్కువగా తినడం వల్ల కేలరీలు బర్న్ అవ్వడం కష్టంగా మారుతుంది. దీంతో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో మరింత బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈ ఎండుద్రాక్ష లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ తో బాధపడేవారు ఈ ఎండు ద్రాక్షకు దూరంగా ఉండటం మంచిది. పిన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. జన్మ సంబంధిత సమస్యలు అలర్జీలు శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడేవారు కిస్మిస్ ఎక్కువగా తినకూడదట.
కిస్‌మిస్ తింటే అలర్జీ సమస్యలు పెరిగే ప్రమాదముంది. అలర్జీ కారణంగా చర్మంపై దద్దుర్లు, వాపులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చని చెబుతున్నారు. అందుకే ఈ సమస్యలు ఉన్నవారు తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు కూడా కిస్మిస్ ని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఎండు ద్రాక్ష ఎక్కువగా తింటే ఈ సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదముందట. అంతేకాకుండా గొంతు నొప్పి వచ్చే ప్రమాదం ఉందట. ఈ సమస్యలు లేనివారు చలికాలంలో కిస్మిస్ తినవచ్చని చెబుతున్నారు.