కూరగాయల్లో ఒకటైన బెండకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొందరు బెండకాయని ఇష్టంగా తింటే మరికొందరు అసలు తినడానికి ఇష్టపడరు. ఇంకొందరు మాత్రం పచ్చిగా తినేస్తూ ఉంటారు. బెండకాయ ను ఉపయోగించి వేపుడు పచ్చడి పులుసు ఇలా చాలా రకాలు వంటలు తయారు చేస్తూ ఉంటారు. బెండకాయతో ఎలాంటి రెసిపీ తయారు చేసిన సూపర్ గా ఉంటుందని చెప్పవచ్చు. బెండకాయ తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బెండకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ కె, సి, ఫోలేట్, మెగ్నిషియం, విటమిన్ బి, మాంగనీస్ వంటి పోషకాలు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి.
బెండకాయలో కాల్షియం, విటమిన్ కె ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయట. అలాగే ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయట. దీంతో క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న బెండకాయ కొందరికి మాత్రం మంచిది కాదట. కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు బెండకాయను తినకపోవడం మంచిదని చెబుతున్నారు. ఇంతకీ వాళ్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం… జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు బెండకాయలు తినకూడదట. ఎందుకంటే బెండకాయ తినడం వల్ల గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందట. అలర్జీ సమస్యతో బాధపడే వారు కూడా బెండకాయకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. చర్మంపై దద్దుర్లు, స్కిన్ అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండాలట. వీళ్లు పొరపాటున కూడా బెండకాయను తినకూడదని చెబుతున్నారు. ఇప్పటికే అలెర్జీ సమస్యలతో బాధపడేవారు బెండకాయ తినడం వల్ల మీ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందట. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు బెండకాయలను ఎక్కువగా తీసుకోకూడదట. బెండకాయల్లో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఆక్సలేట్ స్థాయిలు ఎక్కువ అయితే అవి కిడ్నీలో రాళ్లుగా ఏర్పడతాయి. అందుకే ఇప్పిటికే కిడ్నీలో రాళ్ల సమస్యలు బాధపడుతున్నవారు బెండకాయలు తినకూడదని చెబుతున్నారు. అదేవిధంగా ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు బెండకాయ తినకూడదట.
ఎందుకంటే బెండకాయలో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మోకాళ్లలో నొప్పి, వాపును కలిగిస్తుందట. చలికాలంలో బెండకాయ తింటే ఈ సమస్యలు ఎక్కువగా మారతాయట. అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండటమే మేలు అని చెబుతున్నారు.. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు కూడా బెండకాయకు దూరంగా ఉండాలట. వీరితో పాటుగా రక్తం గడ్డ కట్టే సమస్యతో బాధపడుతున్న వారు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు కూడా బెండకాయను ఎక్కువగా తినకూడదని,ఒకవేళ తినాలి అనుకుంటే వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.