Guava: జామపండు ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఆ సమస్య ఉన్నవారు తీసుకుంటే మాత్రం ప్రమాదమే?

జామ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో ఏంటి

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 06:00 PM IST

జామ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో ఏంటి యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం ఫైబర్ తో పాటు ప్రోటీన్స్ విటమిన్స్ కూడా ఉన్నాయి. వీటి ధర తక్కువ అయినప్పటికీ వీటి వల్ల కలిగే లాభాలు మాత్రం చాలా ఎక్కువ. అందుకే జామపండును పేదవాడి ఆపిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ జామపండు జీర్ణ సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. ఈ పండు మనకు సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్ లలో లభిస్తూ ఉంటుంది. మలబద్దకంతో బాధపడే వారు పండిన జామకాయను తింటే జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్దక బాధను తొలగిస్తుంది.

జామ పండుతో పాటు ఆకులోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జామపండు, ఆకు రసం కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారికి జామ పండు ఎంతో మేలు చేస్తుంది. జామకాయలు గుండె పని తీరును మెరుగుపరుస్తాయి. జామ ఆకుల్లో అధిక స్థాయిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఫ్రీ రాడికల్స్ హృదయాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. జామలో అధిక స్థాయిలో ఉన్న పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. జామ ఆకు రసం రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి తోడ్పడుతుంది.

చాలామంది మహిళలు రుతుస్రావ నొప్పి, తిమ్మిరులు వంటి వాటితో బాధపడుతుంటారు. జామ ఆకు రసం నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. జామకాయలు బరువు తగ్గడానికి అనుకూలమైన ఆహారం. జామ సారం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. జామలో ఉన్న విటమిన్ సి అంటు వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. జామపండులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది. జామపండు ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం కొన్ని రకాల సమస్యలు తప్పవు. కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు కూడా జామ పండును ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. క‌డుపు ఉబ్బ‌రం ఉన్న వాళ్లు త‌క్కువ తీసుకుంటే మంచిది.

ఇందులో సీ విట‌మిన్ పుష్క‌లంగా ఉండ‌టం చేత కడుపు ఉబ్బ‌రం, గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది. అలాగే జామ అతిగా తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ప్రేగు సిండ్రోమ్ తో భాద‌ప‌డేవారు మితంగా తీసుకోవాలి. డ‌యాబెటిస్ పెషెంట్స్ కి జామ మంచిదే అయిన‌ప్ప‌టికి మితంగా తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. జ‌లుబు ద‌గ్గు ఉన్న వారు అధికంగా తీసుకుంటే క‌ఫం పెరిగి స‌మ‌స్య మ‌రింత తీవ్రం అయ్యే ప్ర‌మాదం ఉంది. అలాగే పంటి నొప్పితో భాద‌ప‌డేవారు కూడా జ‌మ‌కు దూరంగా ఉండాలి. లేదా బాగా పండిన జామ‌ను తీసుకోవాలి.