Site icon HashtagU Telugu

Side Effects of Onions: ప్రెగ్నెంట్స్, ఈ వ్యాధులున్నవారు ఉల్లిపాయ తినకూడదు.. ఎందుకంటే..

side effects of onions

side effects of onions

Side Effects of Onions: ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదన్న సామెత ఎప్పటి నుంచో ఉంది. ఉల్లిపాయల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి మరి. కూరగా చేసుకున్నా, పచ్చివి తిన్నా ఆరోగ్యానికి మంచిది. వీటిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కొన్నిరకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. కానీ.. గర్భవతులు, కొన్ని వ్యాధులున్నవారు వీలైనంత వరకూ ఉల్లిపాయలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఉల్లిపాయల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు రావొచ్చు. అందుకే గర్భవతులు వీలైనంత వరకూ ఉల్లిపాయలు తినకపోవడమే మంచిది. జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా ఉల్లిని తినకపోవడం మేలు.

డయాబెటీస్ ఉన్నవారు కూడా ఉల్లికి దూరంగా ఉండాలి. ఉల్లిపాయలు ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా తగ్గిపోతాయి. వీలైనంత తక్కువగా ఉల్లిని తినడం మంచిది. ఎక్కువగా తింటే కొన్నిరకాల అలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఉల్లిపాయ లేకుండా కూరలు వండరు. ప్రతిరోజూ ఉల్లిపాయలను తినే అలవాటున్నవారు వాటిని వీలైనంత తక్కువగా తినాలి. ఉల్లి ఆరోగ్యానికి ఎంత మంచి చేసినా.. మోతాదు మించితే అది విషమే అవుతుంది. లిమిట్ గా తీసుకుంటేనే దివ్యౌషధంగా పనిచేస్తుంది.

Also Read : Eye Health Foods : కళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలివే.. తప్పకుండా తినండి