Site icon HashtagU Telugu

Alcohol Risk: మద్యంతో యువతకే ఎక్కువ రిస్క్.. ఆ సర్వే ఏం చెప్తుందంటే?

Drinking Alcohol

Drinking Alcohol

మద్యపానం చేయడం వల్ల అనారోగ్యం పాడవుతుంది అని తెలిసి కూడా మద్యాన్ని సేవిస్తూనే ఉంటారు.  మద్యపానం  చేయడం వల్ల కలిగే ఎన్నో రకాల అనర్థాల గురించి ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా ప్రతి ఏడాది ఈ మద్యం సేవించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఇంకా చెప్పాలి అంటే రాను రాను ఈ చెడు అలవాట్లకు యువత కూడా బానిసలు అవుతున్నారు. చిన్న చిన్న వయసుకె మధ్యపానం సేవించడం అలవాటుగా చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక అధ్యయనంలో మద్యం సేవించే యువతకు కనివిప్పు కలిగించే ఒక అధ్యయన ఫలితాలు వెలువడ్డాయి.

పెద్ద వయసు వారితో పోలిస్తే యువతలోనే మద్యపానం వల్ల అనర్థాలు ఎక్కువగా ఉంటున్నాయని లాన్సెట్ జర్నల్ లో శుక్రవారం వెలువడిన ఒక అధ్యయనం ఫలితాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 39 ఏళ్లలోపు వారు ఆల్కహాల్ సేవించడం ఎంతో హానికారం అని తెలిసింది. అయితే ఎటువంటి వైద్య సమస్యలు లేని, 40 ఏళ్లకు పైబడిన వారు రోజులో ఒకటి నుంచి రెండు స్టాండర్డ్ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు.

ఒక స్టాండర్డ్ డ్రింక్ అనగా బీరు 375 మిల్లీ లీటర్లు అలాగే బ్రాందీ, విస్కీ, జిన్, వోడ్కా అయితే 30 ఎంఎల్. ఈ విధంగా తక్కువ మోతాదులో తీసుకునే 40 ఏళ్ల పైన వారికి గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు తెలుసుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 204 దేశాల్లో 134 కోట్ల మంది 2020లో ఆల్కహాల్ సేవించినట్టు అంచనా. హానికారక స్థాయిలో మద్యం సేవిస్తోంది 15 నుంచి 39 మధ్య వయసు కలవారే. ఆల్కహాల్ వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో 60 శాతం 15 -39 వయసు నుంచే ఉంటున్నాయి. ఈ విషయంలో యువతకు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే యువత డ్రింక్ చేయవద్దు. పెద్ద వయసులోని వారు స్వల్పమోతాదుతో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు అని ఈ అధ్యయనం సీనియర్ రచయిత ఎమాన్యుయేల్ గకిడో తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా యువత ఈ విషయాన్ని తెలుసుకొని మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. లేదు అంటే ఆ మధ్యపానం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట.

Exit mobile version