Piles: ఫైల్స్ సమస్యతో బాధపడుతున్నారా..ఈ ఆహార పదార్థాలు దూరం పెట్టాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్ల మార్పు కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో పైల్స్ సమస్య కూడా

  • Written By:
  • Publish Date - November 6, 2022 / 07:30 AM IST

ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్ల మార్పు కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో పైల్స్ సమస్య కూడా ఒకటి. పైల్స్ బాధ భరించడం చాలా కష్టం. దీనినే హెమోరాయిడ్స్ అని అంటారు. హెమోరాయిడ్స్ లో పురుషనాలంలోని రక్తనాళాలు ఉబ్బడం ప్రారంభించినప్పుడు పైల్స్ సమస్య వస్తుంది. అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు ఆ ప్రదేశం నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. మనవిసర్జన చేసినప్పుడు అక్కడ తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఈ పైల్స్ సమస్య రావడానికి ప్రధాన కారణం మలబద్దకం. అయితే మలబద్ధకానికి కారణమయ్యే ఆహార పదార్థాలను దూరం పెడితే చాలు మనం పైల్స్ అలాగే మలబద్ధకం సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలు పైల్స్ వాధికి దారితీస్తాయి. ఈ గ్లూటెన్ ఎక్కువగా గోధుమలు, బార్లీ, ఇతర తృణధాన్యాలలో ఉంటుంది. ఈ గ్లూటెన్ రోగనిరోధక వ్యవస్థపై, జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో మీరు మలబద్దకం సమస్య బారిన పడి పైల్స్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెడ్ మీట్ ఉపయోగించడం వల్ల మీరు మలబద్దకం, పైల్స్ సమస్యతో బాధపడవచ్చు. ఈ రెడ్ మీట్ అనే ఆహర పదార్థంలో ఫైబర్, కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని మన శరీరంలో అంత తొందరగా జీర్ణం చేసుకోలేదు కాబట్టి శరీరంలో కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది.

కాబట్టి పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ రెడ్ మీట్ కి దూరంగా ఉండటం మంచిది. అలాగే ఆల్కహాల్.. ఈ ఆల్కహాల్ కారణంగా మలబద్ధకం సమస్య రావచ్చు. ఈ మలబద్ధకం సమస్య క్రమంగా పైల్స్ కూడా దారితీస్తుంది. అలాగే బయట దొరికే జంక్ ఫుడ్స్ కి కూడా దూరంగా ఉండటం మంచిది. బయట బాగా రోస్ట్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పైల్స్ సమస్య రావచ్చు. ఈ జంక్ ఫుడ్ లో కూడా ఫైబర్ తక్కువగా ఉండి, కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకానికి దారితీస్తుంది. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినడం వల్ల పైల్స్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.