Site icon HashtagU Telugu

Peanuts Benefits: మధుమేహం ఉన్నవారు వేరుశనగలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Peanuts Benefits

Peanuts Benefits

మామూలుగా డయాబెటిస్ పేషెంట్ లు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా కాస్త సంకోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా డయాబెటిస్ రోగులకు ఎప్పుడూ కొన్ని సందేహాలు వెంటాడుతూనే ఉంటాయి. ఏ ఆహారం తినాలి? ఏ ఆహారం తినకూడదు వాటి వల్ల సమస్యలు వస్తాయా ఇలా అనేక రకాల సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటైనా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటుంది. మధుమేహంలో కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, కంటి వెలుగు తగ్గడం వంటి ప్రమాదాలు ఉంటాయి.

డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చా లేదా అని ఆలోచించే ఆహార పదార్థాలను వేరుశనగలు కూడా ఒకటి. వీటిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. మరి డయాబెటిస్ పేషెంట్లు వేరుశనగలు తినవచ్చా లేదా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా ఎక్కువ శాతం మంది డయాబెటిస్ పేషెంట్లు అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. షుగర్ పేషెంట్ లకు స్థూలకాయం అతిపెద్ద సమస్యగా ఉంటుంది. వేరు శెనగ తినడం వల్ల అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరానికి హెల్తీ ఫ్యాట్ వేరుశెనగను పేదల బాదంగా చెప్పవచ్చు. హెల్తీ ఫ్యాట్‌కు రిచ్ సోర్స్ ఇది. వీటిని తినడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

మధుమేహం ఉన్నవారు వేరుశనగలు తినడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. పీనట్ బటర్‌లో మెగ్నీషియం మధుమేహానికి ఉపయోగకరం. కొలెస్ట్రాల్‌కు చెక్ వేరుశెనగ తినడం వల్ల రక్త నాళికల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. డయాబెటిస్ రోగులకు గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వేరుశెనగ తినాల్సి ఉంటుంది. వేరుశెనగలో ఉండే న్యూట్రియంట్లు వేరుశెనగను అత్యంత పౌష్టికాహారంగా చెప్పవచ్చు. ఇవి తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ బి కాంప్లెక్స్, ప్యాంటోథెనిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.