Diabetes: మధుమేహం ఉన్నవారు పీనట్ బటర్ తింటే ఏం జరుగుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పీనట్ బటర్ దీనినే వేరుశనగ వెన్న అని కూడా పిలుస్తారు.

  • Written By:
  • Updated On - June 17, 2022 / 09:48 AM IST

పీనట్ బటర్ దీనినే వేరుశనగ వెన్న అని కూడా పిలుస్తారు. అయితే ఈ వేరుశనగ వెన్న ను తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అతిగా తినడం వల్ల అన్నీ నష్టాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు మనం మధుమేహం ఉన్నవారు వేరుశెనగ లేదా వేరుశెనగ వెన్న తినేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫిజియోథెరపిస్టులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పోషకమైన ఆహారాలను ఎక్కువగా తినాలని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే అవి సాధారణంగా శరీరంలోని చెడు కొవ్వుల పరిమాణాన్ని తగ్గించి మన శరీరంలో ఉన్న విషపూరిత పదార్థాలు వాటిని చాలా కాలం పాటు ఆకలితో ఉండకుండా చేస్తుంది. అయితే ప్రతిరోజు వేరుశెనగ వెన్నను అల్పాహారంలో జోడించడం వల్ల చక్కెర మరియు ఉప్పు అవసరం లేని ఆర్గానిక్ పీనట్ బటర్ వంటి ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరింత మేలును చేకూరుస్తాయి. వేరుశెనగ లేదా వేరుశెనగ వెన్న మధుమేహ వ్యాధిగ్రస్తులలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడినప్పటికీ, అవి కొన్నిసార్లు అలెర్జీలకు కూడా కారణం కావచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో వేరుశెనగ వెన్న సహాయపడుతుంది.

అలాగే అలర్జీతో బాధపడే మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుశెనగ వెన్నని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. వేరుశెనగ మరియు వేరుశెనగ వెన్న రెండూ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. శరీర బరువును మెయింటైన్ చేయడానికి వేరుశెనగ సహాయపడుతుంది. ఇకపోతే NIDDK సంస్థ 2011లో జరిపిన ఒక అధ్యయనంలో అమెరికాలో 25 మిలియన్లకు పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుశెనగ వెన్న తీసుకోవడం ద్వారా వారి రక్తంలో చక్కెర స్థాయిలను విజయవంతంగా నియంత్రించారని కనుగొన్నారు. డాక్టర్ సూచించిన మందుల ద్వారా మరియు పోషకమైన వేరుశెనగ వెన్నను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా వారు సమతుల్య శరీర బరువును నిర్వహించగలుగుతున్నారని మరియు వారి రక్తంలో చక్కెర స్థాయిలను నిశితంగా పరిశీలించవచ్చని అధ్యయనంలో తేలింది.