Site icon HashtagU Telugu

Parotta: ప్రతిరోజు పరోటా తింటే ఏం జరుగుతుందో, ఇలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?

Parotta

Parotta

మనలో చాలామందికి పరోటా అంటే చాలా ఇష్టం. పరోటా నాన్ వెజ్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుందని చెప్పాలి. అందరి ఇంట్లో తినే పరోటాని ఇష్టపడితే మరి కొందరు మాత్రం బయట చేసే పరోటాని తెగ ఇష్టపడి తింటూ ఉంటారు. పూరి చపాతీలను ఏ విధంగా అయితే ఇష్టంగా తింటారో అదే విధంగా పరోటాలను ఇష్టంగా తినే వారు కూడా ఉన్నారు. అయితే ఈ పరోటాను ప్రతి రోజు తినవచ్చా? ఇవి ఆరోగ్యానికి మంచివేనా? ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పరోటా ఆరోగ్యానికి మంచిదే కానీ దాదాపుగా పరోటాని ఎక్కువగా మైదాపిండితోనే తయారు చేస్తూ ఉంటారు. మైదాపిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మైదాపిండి జీర్ణ వ్యవస్థను చాలా దెబ్బతీస్తుంది. ఇది అంత త్వరగా జీర్ణం కాదు. పరోటా జీర్ణం అవ్వడానికి జీర్ణాశయ అవయవాలు ఎక్కువ సమయం తీసుకుంటాయి. గోధుమ పిండి నుంచి మైదాను వేరు చేయడం కోసం బెంజాయిల్ పెరాక్సైడ్ అనే ఒక రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇదే రసాయనం మనం తలకు వేసుకునే జుట్టుకు రంగుల్లో కూడా కలుపుతారు. ఇలా మనకు తెలియకుండానే స్లో పాయిజన్ కెమికల్స్ రూపంలో తీసుకుంటూనే ఉన్నాం.

అంతేకాకుండా, మైదాలో ఫైబర్ అస్సలు ఉండదు. కాబట్టి పరోటా ఎక్కువగా తినేవారికి మలబద్ధకం సమస్య వస్తుందట. ముఖ్యంగా, రాత్రిపూట పరోటా తినడం మరణాన్ని వెతుక్కు వెళ్లడంతో సమానం అని చెబుతున్నారు. పరోటా రుచిని పెంచడానికి అందులో అజినమోటోని కలుపుతారట. అంతేకాకుండా పరోటాకు పోసే సాల్నాలో కూడా ఇదే కలుపుతారట. మైదా పిండిని చైనా, ఇంగ్లాండ్ వంటి అనేక దేశాలు నిషేధించాయి. అలాగే, పరోటా మాత్రమే కాదు మైదా పిండితో తయారు చేసే ఏ ఆహారాలు కూడా ఆరోగ్యానికి హానికరం.