Site icon HashtagU Telugu

Paracetamol: నొప్పులకు జ్వరానికి ఈ టాబ్లెట్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే మీ ప్రాణానికి ప్రమాదం?

Paracetamol

Paracetamol

కరోనా మహమ్మారి తర్వాత ప్రజలకు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ అయింది. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల అవగాహన కూడా పెరిగింది. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చాలామంది చిన్నపాటి ఒళ్ళు నొప్పులకు అలాగే దగ్గు, జలుబుకు, జ్వరం వచ్చినా చాలు వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ నీ మింగుతున్నారు. కనీసం వైద్యుని సంప్రదించకుండానే ఈ టాబ్లెట్ నీ వారికి ఇష్టం వచ్చిన విధంగా మింగుతున్నారు. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది కానీ చిన్నవాటికి పెద్దవాటికి ఇలా టాబ్లెట్స్ లను ఉపయోగించడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అదేవిధంగా ఎటువంటి సమస్య వచ్చినా పారాసిటమాల్ టాబ్లెట్ ను వేసుకోవడం సరైన పద్ధతి కాదు అంటున్నారు.

ఈ టాబ్లెట్ ను మోతాదుకు కొంచెం వాడడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు జ్వరం వస్తే చాలు పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను వేస్తున్నారు. ఈ మెడిసిన్ మంచిదే అయినప్పటికి ఎంత మోతాదులో వేయాలో తెలియకపోతే ప్రాణాల మీదికి రావచ్చు. పారాసిటమాల్ తో పాటుగా దీని అనుబంధ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడటం వల్ల అది స్లో పాయిజన్ గా మారి శరీరంలోకి కొద్దికొద్దిగా ఎక్కుతుంది. పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను జ్వరం తగ్గడానికి, తలనొప్పికి, ఒంటి నొప్పులను, పంటి నొప్పికి వేసుకుంటున్నారు. కానీ పారాసిటమాల్ టాబ్లెట్ నో డాక్టర్ ను సంప్రదించకుండా వాడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పారాసెటమాల్ టాబ్లెట్ వల్ల లివర్ దెబ్బతింటుంది.

పారాసెటమాల్ లో ఎసిటమైనోఫెన్ అనే ఒక రకం ట్యాబ్లెట్. ఇది అన్నింటిలో చాలా డేంజర్. ఈ మందు బిల్లను నడుం నొప్పి, రుతుక్రమం, జ్వరం, పంటి నొప్పి, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జలుబు వంటి సమస్యలకు వేసుకుంటూ ఉంటారు. అయితే పారాసిటమాల్ టాబ్లెట్ ని ఇష్టానుసారంగా వేసుకుంటేనే లివర్ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే ఇకపై దీనిని వేసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం తప్పనిసరి. పెద్దలతోపాటు పిల్లలు కూడా ఆ పారాసిటమాల్ టాబ్లెట్ ని ఉపయోగించేటప్పుడు వైద్యుడిని సంప్రదించి ఆ తర్వాత దానిని తీసుకోవడం మంచిది. ఈ ట్యాబ్లెట్ కాలెయం దెబ్బతినడానికి కారణమవుతుంది. ఈ ట్యాబ్లెట్ ను ఆల్కహాల్ ను ఎక్కువగా తాగే వారు తీసుకుంటే అది వారి శరీరానికి విషంగా తయారవుతుంది. దాంతో వారి కాలెయ ఆరోగ్యం దెబ్బతిని చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.