Health Tips: ఈ సమస్య ఉన్నవారు బొప్పాయి తింటే ఇక అంతే సంగతులు?

సాధారణంగా పండ్లు తినమని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు

  • Written By:
  • Publish Date - November 16, 2022 / 07:30 AM IST

సాధారణంగా పండ్లు తినమని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. పండు తినడమే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు కొన్ని పనులను తినడం అస్సలు మంచిది కాదు. అలాంటి వాటిలో బొప్పాయి కూడా ఒకటి. బొప్పాయి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు ఈ బొప్పాయిని అస్సలు తినకూడదు. మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు బొప్పాయిని అసలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బొప్పాయిలో విటమిన్ సి విటమిన్ ఏ కాల్షియం మెగ్నీషియం లాంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. బొప్పాయిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బొప్పాయి మనకు సంవత్సరం పొడుగునా కూడా అందుబాటులో ఉంటుంది. చాలామంది బొప్పాయిని ఇష్టపడి తింటూ ఉంటారు. మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు బొప్పాయిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తినకూడదు అన్న విషయం తెలిసిందే. గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తినడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బొప్పాయి వేడిగా ఉండటం వల్ల గర్భాశయ సంకోచాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా బొప్పాయిలో ఉండే పపైన్ అనే పదార్థం బిడ్డపై ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బొప్పాయిని తినకూడదు. ఎందుకంటే బొప్పాయిలో ఉండే క్యాల్షియం ఆక్సలేట్ ఉత్పత్తిని పెంచి మూత్రపిండాల్లో రాళ్లను మరింత పెంచుతుంది.

ఆ తరువాత మూత్రం ద్వారా బయటికి రావడం అన్నది కష్టతరం అవుతుంది. అలాగే మీరు కొన్ని రకాల అలర్జీలతో బాధపడుతున్నప్పుడు బొప్పాయిని తినకూడదు. ఒకవేళ తినాలి అనుకుంటే వెంటనే వైద్యుని సంప్రదించి తీసుకోవడం మంచిది. మధుమేహం ఉన్నవారు బొప్పాయిని తీసుకోవడం మంచిదే కానీ శరీరంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకుంటే బొప్పాయి చక్కర స్థాయిని మరింత పెంచుతుంది. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు బొప్పాయిని తినకపోవడం మంచిది. మిగిలిన వారు బొప్పాయిని తినడం మంచిదే కానీ మితంగా తినాలి ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.