Papaya Seeds: బొప్పాయి గింజల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?

  • Written By:
  • Publish Date - March 16, 2024 / 03:00 PM IST

బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే వైద్యులు తరచూ బొప్పాయి పండును తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవాటిలో బొప్పాయి ఒకటి. ఇందులో విటమిన్లతోపాటు పోషక విలువలు దండిగా ఉంటాయి. అయితే ఈ పండును తిన్నప్పుడు గింజలను పడేస్తుంటాం. కానీ వాటివల్ల ఉపయోగాలు తెలిస్తే ఎప్పుడూ ఆ గింజల్ని పారవేయం. మరి బొప్పాయి గింజల వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఇలా పొడి చేసినదాన్ని ఆహారంపై చల్లుకొని తినవచ్చు. సలాడ్లు, స్మూతీస్ లాంటి వంటకాలపై చల్లుకోవచ్చు. ఈ గింజలు మిరియాల రుచిని పోలి ఉంటాయి. మసాలా దినుసుల్లా కూడా వాడుకోవచ్చు. వీటిల్లో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం లాంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి తోడ్పడతాయి. అర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో విటమిన్ సి ఉంటుంది.

వ్యాధి నిరోధకతను పెంచి రోగాల బారిన పడకుండా చూస్తాయి. అలాగే వీటిల్లో ఉండే ఫైబర్త్ బరువును తగ్గిస్తుంది. బొప్పాయి గింజలు యాంటీ పారాసిటిక్ లక్షణాలను కలిగివుంటాయి. పరాన్న జీవులను తొలగించడంలో సాయపడతాయి. గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నియంత్రిస్తాయి. అయితే మీరు ఏవైనా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ విషయంలో కాస్త వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.